పార్వతి మెల్టన్ 60 లక్షల కథ తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు?

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ పార్వతి మెల్టన్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Top Hero And Director Behind Parvati Melton Career Spoil, Parvati Melton Career-TeluguStop.com

అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈమె 60లక్షల కథ తెలిస్తే మాత్రం అయ్యో పాపం అనకుండా ఉండలేము.ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

2005లో తెరకెక్కిన వెన్నెల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది పార్వతి.ఈ సినిమాలో కొంతవరకు తన నటనతో మెప్పించింది.

ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.అందులో గేమ్, అల్లరే అల్లరి, జల్సా, మధుమాసం వంటి పలు సినిమాలలో నటించింది.

కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

Telugu Parvati Melton, Mahesh Babu, Parvatimelton, Demans Lakhs, Story, Tollywoo

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ భాషలో కూడా నటించింది.ఇక 2012లో ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటించింది పార్వతి.

ఇదిలా ఉంటే ఈమెకు సంబంధించిన ఓ విషయం అందర్నీ కాస్త అయ్యో అనిపించేలా ఉంది.గతంలో టాలీవుడ్ నిర్మాత శింగనమల రమేష్ వరుడు సినిమా కోసం ఆమెకు దాదాపు అరవై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడట.

Telugu Parvati Melton, Mahesh Babu, Parvatimelton, Demans Lakhs, Story, Tollywoo

డైరెక్టర్ త్రివిక్రమ్ సూచన మేరకే ఈమెకు డబ్బులు ఇచ్చారట.కానీ కొన్ని కారణాలతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారట.ఇక నిర్మాత తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వమని అడిగాడట.కానీ పార్వతి మాత్రం ఇవ్వలేక పోయిందట.కారణం ఆమె వాళ్ళ సినిమా కోసం చాలా రోజులు పాత్ర లభిస్తుంది అని ఎదురు చూసిందట.ఆ సమయంలో తనకు బయటనుంచి వచ్చిన ప్రాజెక్టులను కూడా వదులుకుందట.

అలా ఆ సమయంలో వాళ్లు కూడా తనను ఆ సినిమా నుంచి తప్పించడంతో తన కెరీర్ ఎటూ కాకుండా నాశనం అయిందని తెలిసింది.అదే సమయంలో పులి అని ఓ ప్రాజెక్టు కూడా డీల్ అవడంతో ఆమె నుండి ఎంతో కొంత డబ్బులు వసూలు చేయాలని నిర్మాత రమేష్ ఫిక్స్ అయ్యాడట.

దాంతో ఈ విషయం పార్వతికి తెలియడంతో అతని నుంచి తప్పించుకొని తిరిగిందట.

Telugu Parvati Melton, Mahesh Babu, Parvatimelton, Demans Lakhs, Story, Tollywoo

ఇక ఈ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఇన్వాల్వ్ చేయొద్దు అని మహేష్ అనడంతో నిర్మాత రమేష్ మాత్రం ఎలాగైనా పార్వతి దగ్గర్నుండి 60 లక్షలు వసూలు చేసుకోవాలని భావించాడట.దీంతో అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారగా.ఆమె అభిమానులు ఆమెను అయ్యో అంటూ ఆమె కెరీర్ మొత్తం నాశనం చేశారు అంటూ వాపోయారు.

ఆ తర్వాత కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్వతి కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.తనను ఓ పెద్ద డైరెక్టర్, ఓ హీరో కలిసి అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకున్నారని ఆ తర్వాత వాళ్ళు తనకు మళ్లీ కనిపించలేదని అక్కడి వరకే తన కెరీర్ ఆగిపోయిందని బాగా ఎమోషనల్ తో తెలిపింది.

ఇక ఆమె పెళ్లి చేసుకొని ప్రస్తుతం తన భర్తతో సంతోషంగా గడుపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube