జయంతి మనవడు కూడా స్టార్ హీరో అని మీకు తెలుసా..?

ప్రముఖ సినీ నటి జయంతి ఈరోజు ఉదయం బెంగళూరు నగరంలోని సొంతింట్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.గత కొన్ని నెలలుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న జయంతి పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు.

 Do You Know Actor Prashnath Is Grand Son Of Late Actress Jayanthi, Grandson,jaya-TeluguStop.com

దాదాపు మూడు వందల సినిమాలలో హీరోయిన్ గా నటించడంతో పాటు కొన్ని సినిమాల్లో జయంతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.అలనాటి హీరోలకు జోడీగా జయంతి ఎక్కువగా నటించారు.

మిస్ లీలావతి అనే సినిమా జయంతికి 1965 సంవత్సరంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను తెచ్చింది.దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా జయంతి నటించారు.

జయంతి ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ లో కూడా నటించడం గమనార్హం.కర్ణాటకలో బళ్లారిలో జన్మించిన జయంతి జస్టిస్ చౌదరి, దేవదాసు, పెదరాయుడు సినిమాల్లో నటించారు.

Telugu Grand Son, Jayanthi, Jeans, Kollywood, Prashnath, Marriages, Vinayavidhey

జయంతి నటనకు రెండుసార్లు కర్ణాటక ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.అయితే పాలిటిక్స్, వివాహ బంధం జయంతికి కలిసిరాలేదనే చెప్పాలి.ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా ముగ్గురు భర్తలతో విడిపోవడం గమనార్హం.జయంతి లోక్ సత్తా పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయగా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.అయితే జయంతి మనవడు ప్రశాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Telugu Grand Son, Jayanthi, Jeans, Kollywood, Prashnath, Marriages, Vinayavidhey

పేకేటి శివరాం అనే వ్యక్తికి జయంతి రెండో భార్య కాగా శివరాం మొదటి భార్య రెండో కొడుకు త్యాగరాజన్.త్యాగరాజన్ కొడుకు ప్రశాంత్ కావడంతో జయంతికి ప్రశాంత్ వరుసకు మనవడు అవుతారు.తెలుగులో జీన్స్, వినయ విధేయ రామ సినిమాలలో ప్రశాంత్ నటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా తమిళ సినిమాల్లో ప్రశాంత్ ఎక్కువగా నటించారు.వినయ విధేయ రామ తర్వాత ప్రశాంత్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube