తెలుగు ఇండస్ట్రీని వణికించిన విమానప్రయాణం గురించి మీకు తెలుసా?

ఒక సినిమా తీయాలంటే అందులో ఎన్నో సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది.ఇక వాటి కోసం ప్రత్యేకంగా సెట్ లు అంతేకాకుండా కొన్ని ప్రదేశాలలో కూడా తిరగాల్సి ఉంటుంది.

 Do You Know Aboutthe Equal Journey Thatin Telugu Industary-TeluguStop.com

అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు బయట దేశాలలో జరుగగా వాటికోసం సినీ నటులు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అలా కొన్ని సందర్భాలలో వాహనాల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

కానీ ఒక పెద్ద ప్రమాదం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ వణికించింది.

 Do You Know Aboutthe Equal Journey Thatin Telugu Industary-తెలుగు ఇండస్ట్రీని వణికించిన విమానప్రయాణం గురించి మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు ఓ సినిమా కోసం విమానంలో ప్రయాణించారు.

ఇక ఆ విమానంలో 272 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా తగలకుండా ప్రాణాలతో బయటపడ్డారు.ఇంతకీ అందులో వెళ్లిన నటులు ఎవరు ఆ ప్రమాదం ఎలా జరిగిందని చాలా వరకు ఎవరికీ తెలియదు.1993 నవంబర్ 15న మద్రాస్ నుంచి ఢిల్లీకి హైదరాబాద్ మీదుగా వెళ్లే ఎయిర్ బస్ విమానం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బయలుదేరింది.

ఇక అందులో కాక్ పిట్ లో సీనియర్ పైలెట్ కెప్టెన్ భల్లా, కో పైలెట్ వెల్ రాజ్ ఉన్నారు.ఇక అందులో సినీ నటుడు చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, సుధాకర్, బ్రహ్మానందం, కాస్ట్యూమ్స్ కృష్ణ, డైరెక్టర్ బాపు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణ రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్ డి సుందర్, నిర్మాతలు శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, నరసింహారావు, డాన్సర్ సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ పలువురు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు తమ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేశారు.

Telugu Air Travel, Chiraneevi, Mahakar, Mala Sri, Ramalingamu, Venkatesame, Vijayashanti-Movie

ఇక హైదరాబాద్ లో విమానాశ్రయం ల్యాండింగ్ కోసం సిద్ధమవగా అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ పైన కి వెళ్లే సమయంలో విమానంలో యధాస్థానం లోకి వెళ్లాల్సినవి సాంకేతిక లోపం వల్ల వెళ్లకపోవడంతో దీనివల్ల ఇంధనం రెండింతలు ఎక్కువగా ఖర్చయింది.ఇక తిరిగి మద్రాస్ కి బయలుదేరగా రేణిగుంట విమానాశ్రయానికి చేరడానికి కూడా ఇంధనం సరిపోలేదు.ఇక దానికి కెప్టెన్ భల్లా, కో పైలెట్ ఇంజనీర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంకటగిరి సమీపంలోని రెండు గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో ల్యాండ్ చేశారు.

అలా కొంచెం వెనుకకి ల్యాండ్ చేసినట్లయితే చెరువులో పడేదట.అదే కాస్త పక్కన చేసినట్లయితే కరెంటు తీగలపై పడేదట.అలా మొత్తానికి ప్రాణాలతో బయట పడగా ఈ విమాన ప్రయాణం తెలుగు ఇండస్ట్రీని బాగా వణికించింది.

#Air Travel #Vijayashanti #Mahakar #Mala Sri #Chiraneevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు