ఉమా మహేశ్వరి చనిపోవడానికి ముందు ఏం బిజినెస్ చేసేవారో తెలుసా ?

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.సోమవారం రోజు ఉమామహేశ్వరి కన్నుమూయగా అమెరికాలో ఉన్న తన కూతురు వచ్చాక బుధవారం రోజు ఆమె అంత్యక్రియలు ముగిసాయి.

 Do You Know About Uma Maheshwari Business , Uma Maheshwari, Sr Ntr , Ntr Daughter , Hariskrihsna , Uma Maheshwari Business, Bakari Business, Balakrishna, Rama Krishna-TeluguStop.com

ఎన్టీఆర్ కుటుంబాన్ని తీరని విషాదంలో ముంచుతూ ఉమామహేశ్వరి ఇలా బలవన్మరణం చేసుకోవడంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి.అసలు ఎందుకు ఉమామహేశ్వరి ఇలా చేయాల్సి వచ్చింది అనే దానిపై అనేక చర్చలు సోషల్ మీడియాలో జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఉమా మహేశ్వరి వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉండటం వల్ల ఆమె గురించిన సెర్చ్ ఎక్కువగా జరుగుతుంది.

 Do You Know About Uma Maheshwari Business , Uma Maheshwari, Sr Ntr , Ntr Daughter , Hariskrihsna , Uma Maheshwari Business, Bakari Business, Balakrishna, Rama Krishna-ఉమా మహేశ్వరి చనిపోవడానికి ముందు ఏం బిజినెస్ చేసేవారో తెలుసా -,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ కి 8 మంది కుమారులు నలుగురు కుమార్తెలు ఉండగా, ఇప్పటికే ముగ్గురు స్వర్గస్తులు అయ్యారు.

ఎన్టీఆర్ తొలి సంతానమైన రామకృష్ణ పదేళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూయడంతో ఎనిమిదవ కుమారుడికి మళ్ళీ రామకృష్ణ పేరు పెట్టుకున్నాడు ఎన్టీఆర్.అలా ఏడుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు మాత్రమే ఉండగా, ఆ మధ్యకాలంలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇక ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన చిన్న కూతురు ఉమామహేశ్వరి చనిపోవడంతో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది.వాస్తవానికి ఎన్టీఆర్ కి ఉమామహేశ్వరి అంటే పంచప్రాణాలు.

ఆయన తుది శ్వాస విడిచే వరకు ఉమామహేశ్వరి ఇంట్లోనే ఉన్నారు ఎన్టీఆర్.ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆవిడే దగ్గరుండి చూసుకునేవారు.

అఫీషియల్ మీటింగ్స్, ఆయన సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఉమామహేశ్వరి దగ్గరుండి చూసుకునేవారు.మొదటి వివాహం విఫలం కావడంతో కొన్నాళ్లపాటు ఉమామహేశ్వరి ఎన్టీఆర్ తోనే తన సమయాన్ని గడిపింది.

ఆ తర్వాత మరొక వివాహం జరిగి ఆమె జీవితం సెటిల్ అయింది అని అంతా భావించగా ఉన్నపలంగా ఇలా జరగడం ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు.

ఉమా మహేశ్వరి కి ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు అయ్యి సెటిల్ అయిపోయారు.అయితే ఉమామహేశ్వరి రెండవ వివాహం తర్వాత బేకరీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.కొన్నాళ్లపాటు అది బాగానే జరిగినా కూతుర్ల పెళ్లిలు అయ్యాక ఆమె ఎందుకో ఒంటరితనం ఫీలయ్యారు.

భర్త కూడా ఎప్పుడు బిజినెస్ లతో బిజీగా ఉంటూ బయట తిరుగుతూ ఉండడం వల్ల ఆమె ఇంట్లోనే ఉంటదిగా గడపాల్సి రావడం తో అటు బేకరీ కి కూడా వెళ్లడం మానేసి పూర్తిగా ఇంట్లోనే ఉంటూ తీవ్ర డిప్రెషన్ కి లోనయ్యారు.ఆ తర్వాత ఆ డిప్రెషన్ బారిన పడి ఆమె చివరికి కన్నుమూశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube