ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి వెహికల్స్ ఉంటున్నాయి.సిటీల్లోనే కాదు మారుమూల గ్రామాల్లో సైతం బైక్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ప్రతీ ఇంట్లో దాదాపుగా టూ వీలర్ ఉంటుంది.కొందరి ఇళ్లోనే బైక్ లే కాదు కార్లు కూడా ఉంటున్నాయి.ఈ క్రమంలో బైక్ పై బయటకు వెళ్తున్న క్రమంలో మనందరం సిగ్నల్ దగ్గరో లేదా ఇంకేదో ప్లేస్‌లోనో ట్రాఫిక్ పోలీస్‌ను చూడగానే భయపడిపోతుంటాం.ఎందుకంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ మన బండి వద్దకు వచ్చి అన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని కారణం చెప్పి ఫైన్ రాస్తాడేమోనని అనుకుంటాం.
చాలా సార్లు ఇటువంటి ఘటనలు జరిగాయి.ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
అయితే, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూడగానే మీరు భయపడకుండా ఏం చేయాలో ఈ స్టోరి చదివి తెలుసుకుందాం.
ఏదేని పని నిమిత్తం బైక్ పై వెళ్లిన లేదా ఆఫీసుకు వెళ్తున్న క్రమంలో మనం నడుపుతున్న బండిని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆపితే భయపడాల్సిన పని లేదు.
రూల్స్ ప్రకారం సబ్ ఇన్‌స్పెక్టర్ లేదా అంతకంటే పై స్థాయి అధికారులు మాత్రమే బండిని చెక్ చేయాలి.వారికి మాత్రమే బండిని చెక్ చేసే రైట్ ఉంటుంది.
కానిస్టేబుల్ కేవలం ఎస్‌ఐ వద్దకు తీసుకెళ్లాలి.కానిస్టేబుల్‌కు బండిని ఆపే అధికారం లేదని గుర్తుంచుకోవాలి.
ఇకపోతే మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 130 ప్రకారం మీరు లైసెన్స్, ఆర్సీని పోలీసులకు చూపిస్తే చాలు.కానిస్టేబుల్ లేదా ఎస్‌ఐ లేదా పై స్థాయి అధికారుల చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇక మీ బండి కీస్‌ను తీసుకునే అధికారం ఏ పోలీసు అధికారికి ఉండబోదు.అయితే, ఏదేని కారణాల చేత మీ బండిని వారు ఆధీనంలోకి తీసుకున్నట్లయితే సదరు పోలీసు అధికారి తన వివరాలతో పాటు ఆ రోజు తేదీ, సమయం ఇతర వివరాలు నోట్ చేసిన రిసిప్ట్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది.కావున మీ బండిని ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా ఇతర పోలీసు అధికారులు ఆపిన సమయంలో మీరు ధైర్యంగా ఈ రూల్స్ గురించి మాట్లాడండి.