అస‌లు పేరే లేని ఈ రైల్వే స్టేష‌న్ గురించి మీకు తెలుసా..

Do You Know About This Unnamed Railway Station

రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కు కానీ పేర్లు లేకపోతే ఎట్టుంటాయో తెలసా.వినేందుకే ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్తను గనుక చదివితే షాక్ కు గురికావడం ఖాయం.

 Do You Know About This Unnamed Railway Station-TeluguStop.com

అటువంటి ఓ స్టేషన్ ఉందని ఇంతవరకూ సరిగా ఎవ్వరికీ తెలియదు.కానీ మన ఇండియాలో పేరులేని రైల్వే స్టేషన్ ఒకటి ఉంది.

ఈ విషయం చెప్పింది ఎవరో కాదు భారత రైల్వే శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.ఇంతకీ పేరు లేనిరైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే.

 Do You Know About This Unnamed Railway Station-అస‌లు పేరే లేని ఈ రైల్వే స్టేష‌న్ గురించి మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2017లో రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మన దేశంలో మొత్తం అప్పటి వరకు 7349 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కొన్ని రైల్వే స్టేషన్లకు పెద్ద పేర్లు ఉంటే మరికొన్ని రైల్వే స్టేషన్లకు చిన్న పేర్లు ఉన్నాయి.

కానీ ఇలా పేరే లేని రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా ఆశ్చర్యమే.ఈ పేరు లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.ఈ రైల్వే స్టేషన్ కు పేరు పెట్టకపోవడానికి అక్కడ పెద్ద చరిత్రే ఉందట.

ఈ స్టేషన్ కు పేరు పెడదామని చూడగా.రేనా మరియు రాయ్ నగర్ గ్రామాల ప్రజలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారట.ఈ సమస్య కొలిక్కి వచ్చేలా లేదని తెలిసి రైల్వే అధికారులు ఈ స్టేషన్ కు పేరు పెట్టకుండా వదిలేశారు.2008 వ సంవత్సరం నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండానే ఉంది.ఈ స్టేషన్ లో ప్రతి రోజూ ఆరు రైళ్లు ఆగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

అయినా కూడా ఈ స్టేషన్ కు పేరు పెట్టలేదు.నిజంగా విచిత్రంగా ఉంది కదూ.పేరు లేని రైల్వే స్టేషన్ ఉండడం.మరి ఆ స్టేషన్ లో దిగే వారు ఏం పేరు చెప్పి టికెట్ తీసుకుంటారో.

#Ray Nagar #Rena #Unnamed Railway #Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube