విశాఖ‌ప‌ట్నంలో ఈ దెయ్యం చెట్టు గురించి మీకు తెలుసా..?

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అని పెద్దలు మనందరికీ చెప్తుంటారు.ప్రతీ ఒక్కరు తమ పుట్టిన రోజు నాడు మొక్కలను నాటాలని, అవి చెట్లుగా మారి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని వివరిస్తుంటారు.

 Do You Know About This Ghost Tree In Visakhapatnam-TeluguStop.com

అలా చెట్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.ఇకపోతే రోడ్లకు ఇరవైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తుండటం మనం చూడొచ్చు.

అలా నాటిన మొక్కలు పెద్దవై చెట్లుగా మారుతుంటాయి.అలా ఏపీలోని విశాఖపట్నంలో సాగర తీరాన ఒక రోజు నాటిన మొక్కల్లో ఒకటి పెద్దదై జనాలను భయపెడుతున్నది.

 Do You Know About This Ghost Tree In Visakhapatnam-విశాఖ‌ప‌ట్నంలో ఈ దెయ్యం చెట్టు గురించి మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటీ.చెట్టు భయపట్టెడమేంటీ? అనుకుంటున్నారా? అవునండీ.మీరు చదివింది నిజమే.ఆ చెట్లు వద్దకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.ఆ చెట్టు కథేంటో తెలుసుకుందాం.

సాగర తీరమైన విశాఖపట్నం హుద్‌హుద్ తుపాను వల్ల తన ప్రకృతి సంపదను కోల్పోయిన సంగతి అందరికీ విదితమే.

ఈ క్రమంలో వన సంపదను మళ్లీ పెంచి పూర్వ స్థితికి నగరాన్ని తీసుకొచ్చేందుకుగాను గ్రీనరీ ప్రాజెక్టు చేపట్టింది ప్రభుత్వం.అందులో భాగంగానే విశాఖ సిటీలోని పలు ఏరియాలు, రోడ్లకు ఇరువైపులా, గవర్నమెంట్ ఆఫీసెస్, రోడ్ల కూడళ్ల వద్ద ఏడాకులపాల మొక్కలు నాటింది అప్పటి ప్రభుత్వం.

ఆల్ స్టోనీయా స్కోలరీస్ అనే సైంటిఫిక్ పేరున్న ఈ మొక్క అతి తక్కువ టైంలోనే ఏపుగా పెరుగుతుంది.అలా పచ్చదనం ఏర్పడింది.మొత్తంగా విశాఖ సిటీఅంతటా ఈ రకం మొక్కలను ఐదు లక్షలకు పైగా నాటారు.అయితే, ఈ మొక్కలు పెరిగే క్రమంలో పొదల నుంచి పుప్పొడి వెదజల్లుతున్నాయి.

ఇక్కడే ముప్పు పొంచినది.ఈ ఏడాకుల పాల మొక్కల పుప్పొడి వల్ల ప్రజల్లో హెడేక్, వికారం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.ఈ విషయం పలు పరిశోధనల్లో తేలిందని, అందుకే పలు చోట్ల ఈ చెట్లను తొలగించినట్లు ఇప్పటికే విశాఖ ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.ఈ క్రమంలోనే ఈ చెట్లను దెయ్యం చెట్లని స్థానికులు అంటున్నారు.

వాటి దగ్గరలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.అసలు ఈ మొక్కలు నాటొద్దని, ఎలాగూ నాటారు కాబట్టి ఇఫ్పుడు ఆ పూతను తొలగించాలని స్థానికులు కొందరు కోరుతున్నారు.

అయితే, ఈ రకం చెట్ల వల్ల మానవులకు ప్రయోజనాలు కూడా ఉన్నాయని మరి కొందరు వాదిస్తున్నారు.ఈ క్రమంలోనే చెట్లను తొలగించకుండా వాటిని వచ్చే పూత, పుప్పొడిని తొలగించేందుకుగాను చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు.

#Visakhapatnam #Ghost Tree #Andrapradesh #Stonia Scholars

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు