ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ ఫీచర్ గురించి తెలుసా.. ఆటో పవర్ ఆన్ ఆఫ్‌తో లాభాలివే!

ఇపుడు ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ల మయమే.పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

 Do You Know About This Feature In Android Phone Android, App, Technology Updates-TeluguStop.com

దానికి తగ్గట్టే షాపింగుల నుండి బ్యాంకు లావాదేవీలకు అందరూ వీటిపైనే ఆధారపడవలసి పరిస్థితి.మనిషి అవసరకాలకు తగ్గట్టే స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు వివిధ రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ముందుకు వస్తున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ఉపయోగపడే స్పెసిఫికేషన్లు చాలా ఉంటున్నాయి.వీటిలో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్ ఒకటి.

ప్రొఫెషనల్ వర్క్ లైఫ్‌లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెగ్యులర్ మీటింగ్స్‌కు హాజరవ్వాల్సిన సందర్భంలో, పర్సనల్ లైఫ్‌లో యోగా, మెడిటేషన్, ఇతర టైమింగ్స్‌ ఫాలో అవుతున్నప్పుడు ఫోన్‌ను చాలామంది స్విచ్ ఆఫ్ చేస్తుంటారు.అయితే అలా కాకుండా యూజర్లు తమ షెడ్యూల్ ప్రకారం ఆటోమెటిక్‌గా ఫోన్‌ ఆఫ్ అయ్యి, తర్వాత ఆన్ అయ్యేలా ఆటో పవర్ ఆన్/ఆఫ్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.ఆటోమేటిక్ ఆఫ్/ఆన్ ఫీచర్‌ సెట్ చేస్తే, డివైజ్‌ను మాన్యువల్‌గా బూట్ చేయాల్సిన పని తప్పుతుంది.

Telugu Android, Ups-Latest News - Telugu

ఈ రకంగా యూజర్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుంది.ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.ఆప్షన్స్ నుంచి ‘సిస్టమ్ సెట్టింగ్స్’ ఒకదానిని సెలక్ట్ చేయండి.ఇప్పుడు డిస్‌ప్లే అయ్యే రిజల్ట్స్ నుంచి షెడ్యూల్ పవర్ ఆన్, ఆఫ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.ఇక్కడ మీరు ఏ టైమ్‌కు మీ ఫోన్ ఆటోమెటిక్‌గా ఆఫ్ అవ్వాలనుకుంటున్నారు, మళ్లీ ఎప్పుడు ఫోన్ ఆన్ కావాలనుకుంటున్నారనే టైమింగ్స్ ఎంటర్ చేయండి.చివరకు పవర్ ఆన్, పవర్ ఆఫ్ టోగుల్స్ రెండూ ఆన్‌ చేస్తే.

ఈ ఫీచర్ ఆన్‌ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube