పాకిస్తాన్‌లోని ఈ విచిత్రమైన చట్టాల గురించి మీకు తెలుసా?

ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ చట్టాలు ఉంటాయి.కొన్ని దేశాల్లో చాలా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన చ‌ట్టాలు ఉన్నాయి.

 Do You Know About These Weird Laws In Pakistan , Pakistan, Israel, Allah, Mosque-TeluguStop.com

మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో అలాంటి కొన్ని వింత చట్టాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.అలాంటి పాకిస్థాన్‌లోని కొన్ని వింత చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్థాన్‌లో అనుమతి లేకుండా ఎవరి ఫోనునైనా తాకితే అది చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.ఇందుకు గాను 6 నెలల జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.

పాకిస్తాన్ తమ దేశంలోని పౌరులలో ఎవరికీ ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీసా ఇవ్వదు.ఎందుకంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పరిగణించదు.

మీరు పాకిస్తాన్‌లో చదివి, మీ చదువుల కోసం 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, మీరు ప్రభుత్వానికి 5% పన్ను చెల్లించాలి.పాకిస్తాన్‌లో ఎవ‌రైనా ప్రధానమంత్రిని ఎగతాళి చేస్తూ పట్టుబడితే, వారు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

పాకిస్థాన్‌లో పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించకూడదు.ఇది చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.

పవిత్ర రంజాన్ మాసంలో, ఎవరైనా ఇంటి వెలుపల ఏమీ తినకూడదు.ఎందుకంటే ఇది చట్టవిరుద్ధం.

ముస్లిం కానివారు కూడా ఈ నియమాన్ని పాటించాలి.పాకిస్థాన్‌లో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య అత్య‌ధికం అల్లాహ్, మస్జిద్, రసూల్ లేదా నబీ వంటి కొన్ని అరబిక్ పదాలను ఆంగ్లంలోకి అనువదించడం చట్టవిరుద్ధం.

మీరు పాకిస్థాన్‌లోని ఏ వ్యక్తికి పనికిరాని సందేశాలను పంపలేరు.మీరు అనవసరమైన సందేశాలను పంపుతూ పట్టుబడితే, మీరు గరిష్టంగా 10 లక్షల వరకు జరిమానా చెల్లించవలసి వ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube