దుస్తులు ధరించని గ్రామం ఒకటుందనే విషయం మీకు తెలుసా..?!

ప్రపంచంలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం కొనసాగుతూ వస్తుంది.తరాలు మారిన, రోజులు మారిన వాళ్లలో మాత్రం మార్పు అనేది రాదు.

 Do You Know About The Naked Spielplatz Village Of England , Naked Spielplatz Vil-TeluguStop.com

వాళ్ళ పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు.అయితే ఇలాంటి వింత ఆచారాలు గురించి మనం చాలానే చూసాము.

అయితే ఇప్పుడు చెప్పబోయే వింత గురించి తెలిస్తే అవ్వా.అని నోరుతెరిచి ఇదెక్కడి విడ్డురం అని అంటారు.

ఇక్కడి ప్రజలు ఒంటిమీద చిన్న నూలుపోగు కూడా ఉంచుకోకుండా తిరుగుతారట.అయ్యో పాపం వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు లేవేమో అని మాత్రం అనుకోకండి.

ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నవారు ధరించడానికి బట్టలు ఉంటాయి.అలాగే డబ్బులు కూడా ఉంటాయి.

కానీ అక్కడి ప్రజలు బట్టలు మాత్రం ధరించరు.ఎందుకంటే అక్కడి గ్రామవాసులకు ఇది ఒక పురాతన సంప్రదాయం కాబట్టి.

అసలు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది.? ఏంటి.? అనే వివరాలు ఓసారి తెలుసుకుందాం.

ఈ విచిత్రమైన గ్రామం యూకే లో ఉంది.

యూకేలో గల హెర్ట్‌ ఫోర్డ్‌ షైర్‌ లో ఉన్న స్పీల్‌ ప్లాట్జ్ అనే గ్రామంలో ఈ వింత ఆచారం ఇప్పటికి కొనసాగుతుంది.ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సుమారు 85 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామ ప్రజలు బట్టలు లేకుండానే కాలం గడుపుతున్నారు.

మగ, ఆడ, చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడాలేకుండా అందరు కూడా బట్టలు వేసుకోరు.అలా అని వీళ్ళకి ఏమి తెలియని నిరక్షరాస్యులా అంటే అలాను కాదు.

Telugu England, Spielplatz, Strange, Latest-Latest News - Telugu

ఇక్కడి ప్రజలు అందరు చదువుకున్న వారు, ధనవంతులు కూడా.అసలు ఇలాంటి ఒక గ్రామం కూడా ఒకటి ఉంది అని ఇసుల్ట్ రిచర్డ్సన్ 1929 లో ఈ గ్రామాన్ని కనుగొన్నారు.ఈ గ్రామంలో అందరు ఆశ్చర్య పోయేలా పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ సదుపాయాలు కూడా ఉండడం విశేషం.

ఒకవేళ ఆ గ్రామం నుంచి ఎవరయినా వేరే ప్రాంతానికి వెళ్లాలంటే దుస్తులు ధరించే వెళతారు.

మళ్ళీ తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టాక బట్టలు తీసేయాలి.ఇలా జీవించడాన్ని వాళ్ళు ఎంతో గర్వంగా భావిస్తున్నారట.

అసలు సిగ్గు పడడం లాంటివి కూడా ఉండవట.

Telugu England, Spielplatz, Strange, Latest-Latest News - Telugu

అలా అని బట్టలు వేసుకుని జీవిస్తాం అంటే అలా కూడా జీవించే స్వేచ్ఛ ఆ గ్రామంలో ఉంది.కానీ ఎవ్వరు అంత సాహసం చేయరు.వీరి గురించి మీడియాలో అనేక కధనాలు వచ్చినాగాని చివరకు వీళ్ళు అలా బట్టలు లేకుండానే జీవిస్తున్నారు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులు ఆ గ్రామంలోకి వెళ్లాలంటే వాళ్ళు కూడా దుస్తులు లేకుండానే వెళ్ళాలట మరి.జరా జాగ్రత్త సుమీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube