అనుష్క దగ్గర ఉన్న కార్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో కారు విలువ?

తెలుగు సినీ నటి బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Do You Know About The Heroine Anushka Shetty Cars And There Prices , Anushka, Audi Q5 Car, Toyota Corolla Altis,audi A6 Car ,bmw 6 Series,tollywood, Car, Prices, Prabhas,super Movie,telugu Film Industry,anushka Shetty,nagarjuna-TeluguStop.com

ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా అంతగా సక్సెస్ అందుకోలేకపోతుంది.

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

 Do You Know About The Heroine Anushka Shetty Cars And There Prices , Anushka, Audi Q5 Car, Toyota Corolla Altis,Audi A6 Car ,BMW 6 Series,tollywood, Car, Prices, Prabhas,super Movie,telugu Film Industry,Anushka Shetty,Nagarjuna-అనుష్క దగ్గర ఉన్న కార్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో కారు విలువ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారి నటనతోనే మంచి గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఈమె నటించిన అరుంధతి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.

ఇక అనుష్క కెరీర్ కొంత వరకు నాశనం కావడానికి సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలే కారణమని చెప్పవచ్చు.ఈ సినిమాల తర్వాత మళ్లీ మంచి సక్సెస్ అందుకోలేదు అనుష్క.

గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.

ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశం అందుకుంది.

అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటినుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో అనుష్కను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎన్నోసార్లు ప్రశ్నించారు.కానీ అనుష్క మంచిగా సెటిల్ అయిన తర్వాతనే అని చెప్పి తప్పించుకునేది.

ఇక గతంలో ప్రభాస్ ని కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో పుకార్లు వినిపించాయి.

అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా వారికి ప్రశ్నలు ఎదురవ్వగా .కేవలం స్నేహితులమనే చెప్పుకుని తిరిగే వాళ్ళు.కానీ కొన్నాళ్ల తర్వాత వారి మధ్య మంచి స్నేహం ఉందని బయటపడింది.

కానీ ఇప్పటికీ తెలుగు అభిమానులు అనుష్క, ప్రభాస్ ను జంటగా చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి గురించి ఏ విషయం చెప్పడం లేదు.

కానీ సంపాదనపరంగా మాత్రం అనుష్క బాగా సంపాదించింది.ముఖ్యంగా ఆమె దగ్గర చాలా విలువైన కార్లు ఉన్నాయట.ఇంతకు అవేంటంటే.70 లక్షలు విలువచేసే బీఎండబ్ల్యూ 6 సిరీస్ కారు ఉందట.అంతేకాకుండా 60లక్షల విలువచేసే ఆడి ఏ 6 కారు.ఇక 59 లక్షల విలువచేసే ఆడి క్యూ 5 కారు కూడా ఉందట.ఇక టయోటా కరోలా ఆల్టిస్ కారు కూడా ఉందని తెలుస్తుంది.ఇక తన దగ్గర ఉన్న మొత్తం కార్ల విలువ రెండు రూపాయల కంటే ఎక్కువగా ఉందని తెలిసింది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఓ సినిమాలో బిజీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube