సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మొదటి పాట గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Do You Know About The First Song Written By Sirivennela Sitaramashastri

తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొన్ని రోజుల నుండి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ ఈరోజు ( నవంబర్ 30 ) మరణించారు.ఆయన వయసు 66 సంవత్సరాలు.

 Do You Know About The First Song Written By Sirivennela Sitaramashastri-TeluguStop.com

ఈయన రాసిన పాటలు, పాడిన పాటగురించి ఎంత చెప్పినా తక్కువే.ఈయన రచయితగా, గాయకుడుగానే కాకుండా నటుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈయన ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి గ్రామంలో 1955 మే 20 న జన్మించారు.ఇక ఈయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి.

 Do You Know About The First Song Written By Sirivennela Sitaramashastri-సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మొదటి పాట గురించి మీకు ఈ విషయాలు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన వయసు 66 సంవత్సరాలు.ఈయన హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు.

సీతారామశాస్త్రి చదువుతున్న సమయంలోనే తెలుగు చలన చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ ఆయనలోని అసలైన కళాత్మకుడిని బయట పెట్టారు.

విశ్వనాథ్ గారు తన దర్శకత్వంలో తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశం సీతారామ శాస్త్రి కి ఇచ్చారు.ఇక ఈ సినిమాలో సీతారామశాస్త్రి దాదాపు తొమ్మిది పాటలను అందించారు.ఇందులో ఆయన ‘విధాత తలపున ప్రభవించినది’ అనే పాటను తొలిసారిగా అందించారు.

ఇక ఈ పాట తనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది.ఇక ఈ పాట రాయడానికి తనకు దాదాపు వారం రోజులు పట్టింది.

పాటను బాల సుబ్రహ్మణ్యం, సుశీల పాడారు.

అలా ఆ తర్వాత వరుసగా చందమామ రావే, ఆది బిక్షువు వాడినేది కోరేది.

వంటి ఈ సినిమాలోని అన్ని పాటలను అందించారు.దీంతో ఆయనకు సిరివెన్నెల అనే సినిమా పేరే తనకు ఇంటిపేరుగా మారింది.

అప్పటి నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ఆయనను పిలుచుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఏడాదికి అయిదారు సినిమాలలో అవకాశాలు అందుకున్నారు.

నటుడుగా పలు సినిమాలలో నటించారు.ఇక శివ సినిమాలో ఈయన పాడిన ‘బోటనీ పాట ముంది’ అనే పాట ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.అలా ఎన్నో సినిమాలలో దాదాపు అన్ని పాటలను తానే స్వయంగా అందించారు.అలా ఈ తరం సినిమాలలో కూడా చాలా పాటలను అందించారు.మహాత్మ సినిమాలో మాత్రం ఇందిరమ్మ ఇంటి పేరు పాటకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇక గత ఏడాది విడుదలైన అలా వైకుంఠపురం లో సినిమాలో సామజవరగమన పాట మాత్రం బస్టర్ హిట్ గా నిలిచింది.అలా 1986 నుంచి 2020 వరకు సీతారామశాస్త్రి అందించిన పాటలు ఎంతో విజయాన్ని అందుకున్నాయి.ఈయన గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, తెలుగు ప్రేక్షకులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా ఈయన సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులంతా ఆయన ఆత్మ శాంతి కి సంతాపం తెలుపుతున్నారు.

#Sirivennela #Shiva #Music

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube