ఈ యంగ్ హీరోయిన్ కి పెళ్లయిందని మీకు తెలుసా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ తన్నూరి దర్శకత్వం వహించిన “మళ్లీ రావా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమై తన ఇన్నోసెంట్ నటనతో కుర్రకారుని కట్టిపడేసింది పంజాబీ బ్యూటీ ఆకాంక్ష సింగ్.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ అమ్మడి నటనకి మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

 Do You Know About Telugu Actress Akanksha Singh Marriage-TeluguStop.com

దాంతో ఈ అమ్మడికి కొంతమేర సినిమా అవకాశాలు కూడా బాగానే తలుపు తట్టాయి.ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన మల్టీస్టారర్ దేవదాసు చిత్రంలో  హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో కొత్త సినిమా అవకాశాలు లేవు.

 Do You Know About Telugu Actress Akanksha Singh Marriage-ఈ యంగ్ హీరోయిన్ కి పెళ్లయిందని మీకు తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఆకాంక్ష సింగ్ సెలవులని బాగానే ఎంజాయ్ చేస్తోంది.అయితే ఇప్పటి వరకు హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కి పెళ్లయినట్లు చాలామంది టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెలియదు.

అయితే ఆకాంక్ష సింగ్ 2014వ సంవత్సరంలో రాజస్థాన్ కి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త కునాల్ సైన్  ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే అంతకుముందే ఆకాంక్ష సింగ్ మోడలింగ్ రంగంలో పనిచేయడంతో నటనపై ఆసక్తి పెరిగింది.

దాంతో పెళ్లయిన తర్వాత కూడా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాకపోయినప్పటికీ కన్నడలో ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ తో కలిసిన “పహిల్వాన్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

అంతేకాకుండా పలు సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

దీంతో ప్రస్తుతం ఆకాంక్ష సింగ్ తమిళంలో “క్లాప్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.అలాగే బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ హిందీలో తెరకెక్కిస్తున్న “మేడే” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#Akanksha Singh #AkankshaSingh #AkankshaSingh #DoYou

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు