ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత దారుణమైన డిజాస్టర్ సినిమా కూడా ఉందా...?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నట జీవితంలో హిట్స్,సూపర్ హిట్స్, సున్సేషనల్ సైట్స్, మరియు ఇండస్ట్రియల్ హిట్స్ చాలానే ఉన్నాయి.అయితే అయన కెరీర్ లో డిజాస్టర్ మూవీ ఒకటి ఉందని చాల మందికి తెలియదు.1960 లో విడుదలైన ఆ సినిమా ఆపేరు కాడెద్దులు ఎకరంనేల.అయితే ఎన్టీఆర్ ఆ ఏడాది 10 సినిమాలలో నటించారు.

 Do You Know About Sr Ntr Disaster Movie Details, Senior Ntr, Senior Ntr Disaster-TeluguStop.com

కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా అయేడాదే విడుదల అయింది.ఎన్టీఆర్ ఫాన్స్ బాగా జోష్ లో ఉన్న తరుణం లో కాడెద్దులు ఎకరంనేల సినిమా విడుదలయ్యి డిజాస్టరుగా మిగిలింది.

అంతక ముందు ఎన్టీఆర్ తో దైవ బలం చిత్రాన్ని నిర్మించిన పొన్నలూరు బ్రదర్స్ నిరించిన సినిమా కాడెద్దులు ఎకరంనేల .ఎన్టీఆర్ తోనే బట్టి విక్రమార్కుడు చిత్రాన్ని రూపొందించిన జంపనా ఈ చిత్రానికి దర్శకులు.

ఇందులో పేద రైతుగా ఎన్టీఆర్ నటించగా అయన సరసన షావుకారు జానకి నటించారు.రేలంగి మరో కీలక పాత్ర లో నటించారు.జంపనా దర్శకత్వములో ఎన్టీఆర్ నటించిన భట్టివిక్రమార్కుడు సినిమా 1960 అక్టోబర్ 1న విడుదల అయ్యింది.ఈ సినిమా మంచి టాక్ తో విజయాన్ని అందుకుంది.

అదే సమయంలో అదే దర్శకుడు సేమ్ అదే హీరో తో తీసిన కాదద్దులు ఎకరం నేల సినిమా ఒక వారం రోజుల్లో విడుదల అయ్యింది.ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకో ఆరోజుల్లో చెప్పలేనంత క్రేజ్ ఉండేది.

అలాగే కాడెద్దులు ఎకరం నేల సినిమా చూడటానికుడా జనం ఎగబడ్డారు.కానీ సినిమా చుసిన వారంతా తరువాత నీరుకారిపోయారు.

Telugu Jampana, Kadedduluekaram, Kanna Kuturu, Senior Ntr, Seniorntr, Sr Ntr-Mov

దర్శకనిర్మాతలంతా ఏ సీన్ లు అయితే పండుతాయి అనుకున్నారో అవి అసలు ఏది కాలేకపోయాయి , దానితో వారు అనుకున్నది అంతా రివర్స్ అయ్యింది.కీలకైమా కథ అలాగే సన్నివేశాలతో ఎన్టీఆర్ కెరీర్ లో ప్లాప్ సినిమాలు లేకపోలేదు.కానీ ఈ కాడెద్దులు ఎకరం నేల సినిమా మాత్రం తన కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

అంతే కాదు ఈ సినిమాకి జనాలు అంతగా రాకపోవటం తో కొన్ని కేంద్రాలలో కేవలం ఒక్కరోజు మాత్రమే సినిమాను ఉంచి తర్వాత తీసివేయటం కూడా జరిగింది.

అయితే కాడెద్దులు ఎకరం నేల సినిమా విదుదలైన 8 రోజులు తర్వాత అక్కినేని నటించిన కన్నా కూతురు సినిమా విడుదలైనది.

Telugu Jampana, Kadedduluekaram, Kanna Kuturu, Senior Ntr, Seniorntr, Sr Ntr-Mov

అంతేకాదు యోగానందు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా చేశారు .మరి ఈ సినిమా మరి అంత పెద్ద హిట్ కాదు కానివ్వండి ఒక రకంగా పరవాలేదు అని చెప్పవచు.మరి కాడెద్దులు ఎకరం నేల సినిమా తరువాత ఎన్టీఆర్ బయట చిత్రాలు ఏటి పైన నమ్మకం పెట్టుకోకుండా తన సొంత చిత్రం సీతారాములకల్యాణం పైన పూర్తి దృష్టి పెట్టాడు.

ఇక 1961 జనవరి 6 న సీతారామకల్యాణం సినిమా సూపర్ హిట్ అయ్యింది.మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube