షారుక్ తన బ్యాడ్ హ్యాబిట్ తో అందరిని ఎంత ఇబ్బంది పెడతాడో తెలుసా .?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమా తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు.ప్రజెంట్ పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

 Do You Know About Shahrukh Khan Bad Habbit-TeluguStop.com

అయితే, షారుఖ్‌కు ఇతర బాలీవుడ్ స్టార్ హీరోస్‌తో పోల్చితే ఓ భిన్నమైన బ్యాడ్ హ్యాబిట్ ఉందట.అదేంటంటే.

పార్టీలకు ఆలస్యంగా రావడం. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా తెలిపింది.

 Do You Know About Shahrukh Khan Bad Habbit-షారుక్ తన బ్యాడ్ హ్యాబిట్ తో అందరిని ఎంత ఇబ్బంది పెడతాడో తెలుసా .-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాత్రి పది గంటలకు పార్టీ ఉందని తాను ఇన్వైట్ చేస్తే షారుఖ్ అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఇంటికొచ్చాడని చెప్పింది.అయితే, అప్పటికే పార్టీ అయిపోయి ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయారని పేర్కొంది.

ఈ క్రమంలోనే షారుఖ్ టైమ్ సెన్స్ పట్ల విమర్శలు చేసింది జూహీ చావ్లా.

బీ టౌన్‌లో పార్టీ కల్చర్ జనరల్‌గానే చాలా ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.

సెలబ్రిటీలందరూ పార్టీ టైం చెప్తే చాలు.టైంకు హాజరవుతుంటారని, కానీ, షారుఖ్ మాత్రం డిఫరెంట్ అని జూహీ పేర్కొంది.

అయితే, షారుఖ్‌కు ఉన్న మరో బ్యాడ్ హ్యాబిట్ ఉందట.ప్రతీ సారి ఆలస్యంగా రావడమే కాదు.

అప్పుడప్పుడు అందరి కంటే ముందర వచ్చి సర్‌ప్రైజ్ కూడా చేస్తుంటారట.ఇకపోతే షారుఖ్ సినిమాల విషయానికొస్తే.

భారీ అంచనాలతో విడుదలైన ‘జీరో’ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది.ప్రస్తుతం షారుఖ్ సిద్ధార్థ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘పఠాన్’, తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రాలతో పాటు అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, రణ్‌వీర్ సింగ్ ‘బ్రహ్మస్త్ర’ చిత్రాల్లో స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు.

Telugu Actress Juhi Chawla, Ameer Khan, Bollywood, Juhi Chawla About Sharukh Khan Bad Habbits, Laal Singh Chaddha, Naga Chaitanya, Pathan, Sharukh Khan, Sharukh Khan Bad Habbits, Sharukh Late To Parties-Telugu Stop Exclusive Top Stories

‘పఠాన్’ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకునే నటిస్తుండగా, కీలక పాత్రలో జాన్ అబ్రహం కనిపించనున్నాడు.ఈ మూవీలో బాలీవుడ్ బాద్ షా రా ఏజెంట్‌ పాత్రను పోషిస్తున్నాడు.ఇకపోతే అమీర్‌ఖాన్ నటిస్తున్న రీమేక్ ఫిల్మ్ ‘లాల్ సింగ చద్దా’లో షారుఖ్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ సినిమాలో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు.‘బాలరాజు’ అనే పాత్ర పోషించాడు చై.ఈ పాత్ర‌తో అమీర్‌ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య.

#Sharukh #Pathan #Naga Chaitanya #JuhiChawla #Ameer Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు