ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం దూసుకుపోతుంది.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే అందించారు.భీమ్లా నాయక్ సినిమా మంచి హిట్ దిశగా దూసుకు పోతూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకుడు గా వ్యవహరించిన సాగర్ కే చంద్ర పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు ఎవరు దర్శకుడు సాగర్ కే చంద్ర… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ ఎలా కొట్టేసాడూ అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.
సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ఏరికోరి మరి సాగర్ ను ఎంపిక చేశారు.
కేవలం రెండు సినిమాలకు మాత్రమే ఇతను దర్శకత్వం వహించడం గమనార్హం.రాజేంద్రప్రసాద్ తో అయ్యారే.
నారా రోహిత్ శ్రీ విష్ణు తో అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమాని తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాలు పెద్ద హిట్ అవ్వకపోయినా సాగర్ కే చంద్ర టేకింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.
స్టార్ డైరెక్టర్గా ఉన్నసుకుమార్ సురేందర్ రెడ్డి లు సాగర్ కి ఫోన్ చేసింది అభినందించడం గమనార్హం.
నల్గొండ జిల్లాకు చెందిన సాగర్ బీటెక్ పూర్తి చేసి అమెరికాలో మాస్టర్స్ చేశారు.సినిమా రంగం మీద ఆసక్తితో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో సినిమాటోగ్రాఫర్ తో పాటు కొన్ని కోర్సులు కంప్లీట్ చేశారు.ఇక సాగర్ తండ్రి పేరు రామచంద్ర.
నల్లగొండ స్కూల్స్ చూసుకునే వాడు.ఇక సాగర్ భార్య పేరు గీతారెడ్డి.వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.2017 లో పెళ్లి జరిగిందని తెలుస్తోంది.గీత కూడా సాగర్ లాగే బీటెక్ పూర్తి చేసి మాస్టర్స్ చేసింది.కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ తర్వాత మానేసి ఇంట్లోనే ఉంటుంది.ఇక సాగర్ కు తెలుగు భాష పై ఎక్కువగా పట్టు ఉండటానికిక్ ఎక్కువగా పుస్తకాలు చదవడం కారణం అని తెలుస్తోంది.డైరెక్టర్ కాకపోయి ఉంటే అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడట.
ఇప్పుడు భీమ్లా నాయక్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు.