టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా యంగ్‌గా మారిపోతున్నారు.ఇకపోతే మహేశ్ చాలాకాలం తర్వాత తన వైఫ్ నమ్రతతో కలిసి రీసెంట్గా ఫొటోషూట్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.హలోమ్యాగజైన్ కోసం ఈ బ్యూటిఫుల్ కపుల్ స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది.
మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్‌లో మహేశ్ బాబు ధరించిన స్వెటర్ స్పెషల్‌గా డిజైన్ చేసిందట.సూపర్ స్టైలిష్‌గా ఉన్న ఆ స్వెటర్ మ్యాటర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.మహేశ్ ధరించిన డిప్-డైడ్ హాఫ్ జిప్ రిబ్బెడ్ స్వెటర్ కాస్ట్ 228 యూఎస్ డాలర్లు అనగా ఇండియన్ మనీలో రూ.17 వేలుఇకపోతే ‘హలో మ్యాగజైన్ కోసం మహేశ్ ఫొటోషూట్ చేయగా, ఇందులో నమ్రత వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ ధరించి టామ్ బోయ్‌లా కనిపించింది.మహేశ్ బాబు ప్రస్తుతం em>గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.సినిమా షూటింగ్ కోసం ఇటీవల మహేశ్ స్పెయిన్‌కు వెళ్లారు.
ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుండగా, టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
బ్యాంకింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.మహేశ్ బాబు ఈ ఫిల్మ్‌లో బ్యాంకర్‌గా కనిపించనున్నట్లు ఫ్యాన్స్ చెప్తున్నారు.ఈ చిత్రం నుంచి మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత మహేశ్ తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.
ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది.ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ, టాలీవుడ్ బుట్టబొమ్మ, త్రివిక్రమ్ ఆస్టాన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ఓ చిత్రంలో చేయబోతున్నారని తెలుస్తోంది.