బైక్ ఎయిర్‌బ్యాగ్ గురించి తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..

సాధారణంగా బైక్( Bike ) పై చేసే ప్రయాణాలు చాలా రిస్క్ తో కూడుకున్నవి.

బైక్ పై నుంచి కిందపడితే కాలు లేదా చెయ్యి విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాణాలే పోవచ్చు.ఇక కారులో ప్రయాణం బైక్ తో పోలిస్తే చాలా సురక్షితమని చెప్పవచ్చు.

ఎండ, వాన, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మాత్రమే కాదు రోడ్ యాక్సిడెంట్స్ అయిన సమయాల్లోనూ కారు ప్రయాణికులు బతికే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే వీటిలో ఎయిర్ బ్యాగ్స్ అందిస్తారు.

అయితే బైక్స్ లో కూడా ఇలాంటి ఎయిర్ బ్యాగ్స్ అందించాలని కొందరి ఇంజనీర్లు ఆలోచన చేశారు.

Advertisement

బైక్ లో ఎయిర్ బ్యాగ్ అందిస్తే అది ఎలా పని చేస్తుందో చూపించే ఒక విజువల్ రిప్రజెంటేషన్ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఆ వీడియోను @ScienceGuys_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోలో వెళ్తున్న ఓ కారును వచ్చి ఒక బైక్ ఢీకొని కింద పడుతుంది.

అప్పుడు ఆ రైడర్ కింద పడక ముందే ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఎయిర్ బ్యాగ్( Air bag) ఓపెన్ అవుతుంది.ఆ ఎయిర్ బ్యాగ్ అనేది బైక్ సీటు పైన ఉంచి దానిని కాళ్లకు కట్టుకోవాల్సి ఉంటుంది.

ఏదైనా క్రాష్‌ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది వెంటనే ఓపెన్ అవుతుంది.శరీరం మొత్తాన్ని ఈ ఎయిర్ బ్యాగ్ కవర్ చేస్తుంది.దానివల్ల కింద పడినప్పటికీ గాయాలయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది.

ఈ ఐడియా చూసి చాలామంది ఇది సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు బైక్ యాక్సిడెంట్స్ కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వీరి ప్రాణాలను ఇవి కాపాడగలుగుతాయని మరికొందరు పేర్కొన్నారు అయితే దీని ధర ఎంత ఉంటుందని వివరాలు మాత్రం తెలియలేదు దీనిని నిజంగా తయారు చేశారా, ప్రస్తుతానికి అది ఒక ఆలోచన రూపంలో మాత్రమే ఉందా అనే వివరాలు తెలియ రాలేదు.అయితే ఈ ఎయిర్ బ్యాగ్ తప్పుగా పనిచేస్తే రైడర్ల ప్రమాదం పోయే అవకాశం ఉందని దీనిని బాగా డిజైన్ చేయాలని మరి కొందరు సూచించారు.ఇంకా చాలామంది దీనిపై చాలా రకాల సందేహాలను వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

రెండు కోట్ల దాకా వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ వీడియోను మీరు కూడా చూడండి.

Advertisement

తాజా వార్తలు