Akkineni Nageswara Rao: అక్కినేని కి ఉన్న ఈ వీక్నెస్ గురించి ఎంత మందికి తెలుసు ?

అక్కినేని నాగేశ్వరరావు.( Akkineni Nageswara Rao ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మూల పురుషుడు లాంటి వ్యక్తి.

ఎన్టీఆర్, అక్కినేని సమకాలికులు.రాజకీయ మరకలు లేని అక్కినేని జీవితం ఎంతోమందికి ఆదర్శం.

ఆయన వారసత్వం కూడా ఆ సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతం ఒక రకంగా ఏలుతున్నారనే చెప్పాలి.అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studios ) ద్వారా ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూనే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సేవ చేశారు.

అయితే అక్కినేని కి మరియు ఎన్టీఆర్ కి పొసగదు అనే విషయం అందరికీ తెలుసు.ఎన్టీఆర్ చాలా బోలా మనిషి.

Advertisement

ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పేస్తాడు.కానీ అక్కినేని అలా కాదు కీలెరిగి వాత పెట్టే రకం.

ఎన్టీఆర్( Sr NTR ) రాజకీయాల్లోకి ఎంతగా ఆహ్వానించినా అక్కినేని వెళ్లలేదు.కానీ అక్కినేనికి ఒక వీక్నెస్ ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు.అదే షో బిజినెస్.

అంటే తాను ఎంత గొప్పవాడినో తన ఇంటికి వచ్చిన వారికి, తన దగ్గరికి వచ్చేవారికి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అలాగే చూపించుకోవడం ఆయనకున్న ఒకే ఒక్క వీక్నెస్.పైగా హీరోయిన్స్( Heroines ) అందరితో చాలా చనువుగా సరదాగా వారిపై కామెడీ చేస్తూ నవ్విస్తూ తన చుట్టూనే ఉండేలా చేసుకోవడం కూడా ఆయనకు తెలిసిన మరొక విద్య.

ఎవరినైనా ఇంటికి పిలిస్తే వారికి తానే ఏకంగా దోసెలు వేయడం, పెసరట్లు వేయడం లాంటివి కూడా చేస్తాడు అక్కినేని.అంత డౌన్ టు ఎర్త్ ఉంటూనే అవతల వారితో చక్కటి ఫ్రెండ్షిప్ చేసి వారిని తన కాంపౌండ్ దాటి వెళ్లిపోకుండా చూసుకుంటాడు.అప్పట్లో ఎన్టీఆర్ కాంపౌండ్ లో కొంతమంది ఉంటే అక్కినేని దగ్గర కొంతమంది ఉండేవారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

వీరిద్దరి దగ్గర కలిసి పని చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉండేవారు.అక్కినేని సినిమాల్లో నటించే నటి నటులు మళ్ళీ ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించేవారు కాదు.

Advertisement

అదే విధంగా ఎన్టీఆర్ సినిమాల్లో వచ్చే హీరో హీరోయిన్స్ లేదా నటీనటులు అక్కినేని సినిమాలో కనిపించేవారు కాదు.ఇలా అక్కినేని తన వీక్నెస్ ద్వారా అందరిని లోబరుచుకుంటూ ఉండేవారు.

తాజా వార్తలు