అమలాపురం పాటతో ఓ ఊపు ఉపేసిన అభినయశ్రీని బ్యాంకక్ లో ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా?

Do You Know Abhinayasree Who Made A Specal Place With The Song Of Amalapuram Was Arrested In Bangkok

ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రెటీలు కొన్ని కొన్ని సార్లు తమ వ్యక్తిగత విషయాల్లో బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.అంతేకాకుండా కొన్ని విషయాలలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అరెస్టయిన నటీ నటులు కూడా ఉన్నారు.

 Do You Know Abhinayasree Who Made A Specal Place With The Song Of Amalapuram Was Arrested In Bangkok-TeluguStop.com

చాలా వరకు నటీనటులు వ్యభిచారం విషయంలో, ఏదైనా ప్రమాదాల విషయంలోనే జైలుకు వెళ్తుంటారు.ఇదిలా ఉంటే నటి అభినయశ్రీని కూడా గతంలో పోలీసులు అరెస్టు చేశారట.

ఇంతకీ ఆమెను అరెస్ట్ ఎందుకు చేశారో తెలుసుకుందాం.

 Do You Know Abhinayasree Who Made A Specal Place With The Song Of Amalapuram Was Arrested In Bangkok-అమలాపురం పాటతో ఓ ఊపు ఉపేసిన అభినయశ్రీని బ్యాంకక్ లో ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ నటి అభినయశ్రీ చాలా సినిమాలలో నటించింది గుర్తింపు తెచ్చుకుంది.

ఎక్కువగా స్పెషల్ సాంగ్ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా లో అ అంటే అమలాపురం పాటతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈమె తల్లి కూడా అలనాటి తెలుగు నటి అనురాధ.

తొలిసారిగా స్నేహమంటే ఇదేరా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.ఇక 2014 లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది.

Telugu Abhinayasree, Abinaya Sree Drinking Habit, Actress, Actress Abhinayasree Arrested, Amalapuram Song, Amalapuram Song Actress, Arrested, Arya Movie, Bangkok, Host, Tollywood-Movie

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది అభినయశ్రీ.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షో లలో హోస్ట్ గా చేసింది.తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలలో హోస్ట్ గా చేసింది.ఇదిలా ఉంటే గతంలో అభినయశ్రీ వ్యక్తిగత విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

తనకు బాగా తాగే అలవాటు ఉంది.ఈ అలవాటుతో తను ఏకంగా అరెస్టు కూడా అవ్వాల్సి వచ్చింది.

గతంలో తాను బ్యాంకాక్ కు స్టేజ్ షో నిమిత్తం అక్కడికి వెళ్ళింది.దీంతో తాను స్టేజి మీద బాగా తాగి చిందులు వేసింది.

ఇక తను అలా చేయడంతో అక్కడున్న వారికి నచ్చకపోవడంతో ఇదేంటి అని అభినయశ్రీని అడిగారు.

Telugu Abhinayasree, Abinaya Sree Drinking Habit, Actress, Actress Abhinayasree Arrested, Amalapuram Song, Amalapuram Song Actress, Arrested, Arya Movie, Bangkok, Host, Tollywood-Movie

ఇక దాంతో తిరిగి ఆమె మళ్లీ వాళ్లపై బాగా గొడవ పడిందట.ఇక అక్కడున్న వాళ్ళు సహనాన్ని కోల్పోయి పోలీసులకు కంప్లైంట్ చేశారు.దాంతో ఆమెను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.

నిజానికి ఆమె అలా తాగి చిందులు వేయడం వల్లనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.అంతేకానీ మరే కారణంతో మాత్రం ఆమె జైలుకు వెళ్ళలేదు.

ఇక ఈ విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత తను పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.ఇండస్ట్రీకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని ఒంటరిగా జీవిస్తుందని తెలిసింది.

#Arya #Abhinayasree #Actress #Amalapuram #Bangkok

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube