చనిపోయిన వారి ఫోటోలను గోడకు వేలాడదీశారా.. అయితే సమస్యలు తప్పవు!

సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి ఫోటోలను గుర్తుగా మన ఇంట్లో పెడతాము.చనిపోయిన వారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఇంటిలో వారి ఫోటోలను పెడతాము.

 Do You Keep Ancestral Photos Like This, Ancestral Photos, Architectura, Gods Roo-TeluguStop.com

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోలను ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి పండితులు చెబుతున్నారు.సాధారణంగా మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా గోడకు వేలాడదీస్తారు .ఇలా చేయడం మంచిదేనా? చనిపోయిన వారి ఫోటోలను ఏ దిక్కులో ఉంచాలి? వీరి ఫోటోలు దేవుడు గదిలో ఉంచవచ్చా? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా గోడుకు వేలాడదీయ కూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆ ఫోటోలను ఏదైనా చెక్క బల్ల పై లేదా స్టాండ్ పై ఉంచాలి.అయితే మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా ఉండకూడదు.అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను మనం ఇంట్లోకి రాగానే మనకు కనపడే విధంగా పెట్టకూడదు.ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి అనేక కలహాలు ఏర్పడతాయి.

మరికొందరు వారి పూర్వీకుల ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజలు చేస్తుంటారు.ఇలా చేయడం ముమ్మాటికి తప్పని, ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడు ఆందోళనలు, కలహాలు ఏర్పడి ప్రశాంతత ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా బెడ్ రూం లో కూడా చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదు.ముఖ్యంగా బ్రతికున్న వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారి ఫోటోల పక్కన ఉంచకూడదు.

ఇలా ఉంచడం వల్ల బ్రతికున్న వారికి ఆయుష్షు తగ్గుతుంది అని పండితులు చెబుతున్నారు.చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు కూడా హాలులో ఉత్తర దిశ వైపు పెట్టి ఉండాలి.

ఈ విధంగా పెట్టడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి అంతా మంచి జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube