ఐపీఎల్ 2020 టీం కెప్టెన్స్ చార్జెస్ ఎంతనో తెలుసా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్… ఈ టోర్నమెంట్ భారత్ లో మొదలు అయిన తర్వాత క్రికెట్ పూర్తి స్వభావమే మారిపోయింది.ఇక భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంలా మారిపోయిందంటే నమ్మాల్సిందే.

 Do You How Much Ipl Capitans Are Earning  Ipl 2020, Dhoni, Rohith Sharma, Kohili-TeluguStop.com

అంతలా క్రికెట్ భారతీయులలో పాతుకుపోయింది.ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన 2020 సీజన్ ఎట్టకేలకు నేటి నుంచి మొదలు కాబోతోంది.

అది కూడా పూర్తిస్థాయి ఐపీఎల్ ని యూఏఈ దేశం వేదికగా నిర్వహించబోతోంది బీసీసీఐ.ఐపీఎల్ సెప్టెంబర్ 19న మొదలై నవంబర్ 3 వరకు లీగ్ మ్యాచులు జరుగుతుండగా.నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఐపీఎల్ జట్ల కెప్టెన్లు ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారు అన్న విషయానికి వస్తే… మొదటగా, అత్యధికంగా రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ రూ.17 కోట్ల వేతనం తీసుకుంటుండగా ఆ తర్వాత.ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూ.15 కోట్లు తీసుకుంటున్నారు.ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అలాగే హైదరాబాద్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా రూ.12.5 కోట్లు తీసుకుంటున్నారు.వీరి తర్వాత కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ కె.

ఎల్.రాహుల్ రూ.11 కోట్లను తీసుకుంటున్నారు.అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ రూ.7.4 కోట్లు ఆర్జిస్తుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.7 కోట్లు అందుకుంటున్నారు.ఇలా వివిధ టీం కెప్టెన్స్ ఐపీఎల్ జరిగే 45 రోజులకు గాను విరివిగా ఆదాయాన్ని సంపాదించబోతున్నారు.

ఇక నేడు మొదలయ్యే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య సాయంత్రం 07 :30 కు మొదలు కాబోతుంది.చాలా రోజుల నుండి టీమిండియా సంబంధించి మ్యాచ్ లేకపోవడంతో భారత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube