మన జీవితంలో ఏదో ఒకసారి ప్రమాదాలు వాటిల్లితే సర్వసాధారణమని భావిస్తారు.కానీ పదే పదే ప్రమాదాలు సంభవించడం, చెడు సంఘటనలు ఏర్పడటం వంటివి జరిగితే ఒకసారి ఆలోచించాల్సిందే.
ఎందుకలా జరుగుతుంది? అలా జరగడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? అన్న విషయాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలుమార్లు ఇలా మన జీవితంలో ప్రమాదాలు ఏర్పడడానికి కారణం గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల జరుగుతుంటాయి.
అంతే కాకుండా జాతకంలో అనిశ్చయమైన యోగం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి.ఇలాంటి యోగము ఏర్పడటంవల్ల ఆ వ్యక్తులు మరణం మాదిరిగా బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అసలు ఈ యోగం ఎందుకు ఏర్పడుతుంది? దీనిని ఏ విధంగా నివారించాలి అన్న దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మన జాతకంలో విష యోగం శని గ్రహం కర్కాటక రాశి పుష్య నక్షత్రంలో, చంద్రుడు మకర రాశి శ్రావణ నక్షత్రం లో ఉన్నప్పుడు లేదా చంద్రుడు శని వ్యతిరేక స్థానాలలో ఉన్నప్పుడు ఈ విష యోగం ఏర్పడుతుంది.
ఈ విషయం ఏర్పడటంవల్ల వారి జీవితంలో ఎంతో బాధను, దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
శని, చంద్రుడు వల్ల ఏర్పడే విష యోగం వల్ల వ్యక్తులు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అంతేకాకుండా మరణం, దుఃఖం, రుణ బాధలు, పేదరికం వంటి సమస్యలతో మనిషి మరణం అంచుల దాక వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి.ఈ యోగం ఏర్పడిన వ్యక్తి ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ఆలోచనలను కలిగి ఉంటారు.
శని గ్రహం వల్ల ఏర్పడే ఈ విష యోగ నివారణకు శనివారం ఉదయం రావి చెట్టుకు పూజ చేసి రావి చెట్టు కింద కొబ్బరికాయను కాల్చాలి.ఇలా చేయటం ద్వారా మన మనసులో ఏర్పడేప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
శనివారం నల్లఆవాలను, నల్ల నువ్వులను ఆవు నెయ్యిలో కాల్చివేయడం ద్వారా శని అనుగ్రహం కలిగి విష యోగం నివారణ కలుగుతుంది.అంతేకాకుండా ప్రతి శనివారం ఉదయం బావిలో ఆవుపాలను పోయడం ద్వారా విష యోగాన్ని నివారించవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.