అరచేతి పై త్రిశూలం గుర్తు ఉంటే ఎంత అదృష్టం కలిసి వస్తుందో తెలుసా  

Do You Have Trident/trishul Sign On Your Hand -

మీరు ఒకసారి మీ అరచేతిని బాగా పరిశీలించి చూస్తే కొన్ని రకాల ఆకారాలు మరియు గుర్తులు కనపడతాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి.

అలాగే చాలా మంది ఈ గుర్తులను నమ్ముతారు.అయితే అరచేతిపై త్రిశూలం గుర్తు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.

Do You Have TridentTrishul Sign On Your Hand-Devotional-Telugu Tollywood Photo Image

అయితే అందరి చేతుల్లో ఈ త్రిశూలం గుర్తు ఉండదు.కొంత మందికి మాత్రమే ఉంటుంది.

ఈ త్రిశూలం గుర్తు ఉన్నవారు అదృష్టవంతులు.అయితే అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

శుక్రుడి శిఖర భాగంలో త్రిశూలం గనుక ఉంటే వీరు చాలా అదృష్టవంతులు.

అలాగే వీరు జీవితంలో నిజమైన ప్రేమను పొందుతారు.అంతేకాక ఎదుటివారిని బాగా అర్ధం చేసుకుంటారు.

అంగారకుడి శిఖర భాగంలో లేదా క్రింది భాగంలో త్రిశూలం గనుక ఉంటే త్రిశూలం గుర్తు అంగారకుడి కింది భాగంలో ఉన్నవారు చాలా కష్టపడి చాలా ఆలస్యంగా ధనాన్ని పొందుతారు.అదే భాగంలో ఉంటే విజయవంతమైన క్రీడాకారుడిగా లేదా పోలీస్ ఆఫీసర్ గా ఎదుగుతాడు.

తల గీత చివర గనుక త్రిశూలం ఉంటే త్రిశూలం లోని ఒక భాగం చంద్రుడి శిఖరం దగ్గరికి మరియు మరొక భాగం బుధుడు యొక్క శిఖరం దగ్గరకు ఉంటే మాత్రం అటువంటి వ్యక్తికి మంచి వ్యాపార లక్షణాలు మరియు ఎదుటివారిని ఆకట్టుకొనే విధంగా మాట్లాడే నేర్పు కలిగి ఉంటారు.

చంద్రుడి శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే ఈ వ్యక్తులు చాలా శక్తివంతమైన ఊహలు కలిగి ఉంటారు.

అంతేకాక చాలా సృజనాత్మకంగా ఆలోచించగలరు.వీరు చాలా ప్రేమగా ఉంటారు.

గుండె గీతకు చివర గనుక త్రిశూలం ఉంటే ఈ విధంగా ఉంటే చాలా అదృష్టం కలుగుతుంది.అలాగే వీరు మానసికంగా, శారీరకంగా మరియు భావోద్వేగ పరంగా చాలా ధృడంగా ఉంటారు.

మిగతా వారితో పోలిస్తే చాలా స్థిరంగా కూడా ఉంటారు.సాధారణంగా ఈ గుర్తు బాగా డబ్బున్న ప్రజల దగ్గర చూడవచ్చు.

అదృష్ట గీత గనుక త్రిశూలం దగ్గర సమాప్తం అయితే ఈ వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు.అలాగే డబ్బును కూడా బాగా సంపాదిస్తారు.

స్థిరాస్తి వ్యాపారాల మీద బాగా డబ్బును సంపాదిస్తారు.

బుధుడు యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే వీరు చేసే పనిలో పదోన్నతి పొందుతారు.

అలాగే వారి వాక్ చాతుర్యంతో అందరిని ఆకర్షిస్తారు.ఒకవేళ వ్యాపారం చేస్తే కనుక మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.

అందరి దృష్టిని వారి వైపుకు తిప్పుకుంటారు.

గురుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే వీరికి మంచి గుర్తిపు రావటమే కాకూండా అద్భుతమైన విజ
యాలను అందుకుంటారు.

అంతేకాక వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

శని యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే వీరిలో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది.

వీరు వృత్తి పరంగా చాలా కస్టపడి డబ్బును సంపాదిస్తారు.అలాగే వృతి పరంగా విజయాన్ని అందుకుంటారు.

సూర్యుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే ఇది అరచేతి పై చుక్కతో సమానం.ఈ గుర్తు ఉన్నవారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, ధనవంతులు అవుతారు, విజయం సాధిస్తారు.

అలాగే వృత్తిపరంగా ఎన్నో శిఖరాలను చేరుకొంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Do You Have Trident/Trishul Sign On Your Hand Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL

footer-test