మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయా..?! జర జాగ్రత్త సుమీ..!

చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి.ఉద్యోగాలు మారినప్పుడు గానీ లేదా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు గానీ వారు రెండో బ్యాంక్ అకౌంట్ తీసుకోనే ఉంటారు.

 Do You Have More Than One Bank Account ..?! Be Careful Sumi Bank Account, One R-TeluguStop.com

ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ బ్యాంకు అకౌంట్ గురించి మరిచిపోతారు.ఇలా రెండు అకౌంట్లు ఉన్నవారికి పలు నష్టాలు కలిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా భారీగా పెనాల్టీలు కూడా పడతాయని వారు అంటున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మాములుగా అకౌంట్లలో మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే ఛార్జీలు పడతాయి.అయితే ఇలా ఒకరికే రెండు అకౌంట్లు ఉండటం, వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు ఏకంగా డబుల్ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని సమాచారం.

ఒకవేళ ఆ అకౌంట్లు అవసరం లేకపోతే వెంటనే క్లోజ్ చేయడం మంచిది.

అకౌంట్ క్లోజ్ చేసే ముందుగా మంత్లీ ఈఎంఐ లోన్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (సిప్), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ అకౌంట్) వంటి ఆటోమేటెడ్ డెబిట్స్ ఆ అకౌంట్‌కు లింక్ ఉంటే వాటిని ముందుగానే నిలిపివేయాలి.

అంతేకాకుండా వీటికి ఆల్‌టర్నెట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఇక డీ-లింకింగ్ అకౌంట్ ఫామ్‌లో ఈ వివరాలన్నీ అందించాలి.దీనికి దాదాపు 10 రోజులు పడుతుంది.ఇక ఆ తర్వాతే అకౌంట్ క్లోజ్ అవుతుంది.

మరోవైపు అకౌంట్‌ను ఎందుకు క్లోజ్ చేస్తున్నామో క్లోజర్ ఫార్మ్‌లో తెలిపాలి.అంతేకాకుండా దానిలో ఉన్న డబ్బును ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలో కూడా వేరొక ఫామ్ ద్వారా బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి.

ఇక చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డులు వంటివి కూడా తిరిగి అప్పగించాలి.అటు అకౌంట్‌ను ప్రారంభించిన 14 రోజుల్లోపు అకౌంట్ వద్దనుకుంటే ఎలాంటి చార్జీలు పడవు.

రెండు వారాలు మించితే మాత్రం ఛార్జీలు పడతాయి.ఇలా ఎక్కువ ఖాతాలు ఉంటే మోసగాళ్లు బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube