మీకు ఆధార్ కార్డు వుందా? అయితే ఒక శుభవార్త.. కొత్తగా మరో 4 సేవలు షురూ!

మీకు ఆధార్ కార్డు వుందా? అయినా అదేం ప్రశ్న అని అనుకుంటున్నారా! నిజమే, ఇపుడు ఆధార్ కార్డు లేనివారు దాదాపు ఉందనే వుండరు కదా.అయితే మీకు ఇది ఒక శుభవార్త అన్నమాట.

 Do You Have Aadhar Card? But A Good News 4 More New Services , Aadhar Card, Num-TeluguStop.com

ఉమాంగ్ యాప్‌లో మరో నాలుగు కొత్త ఆధార్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.ఈ విషయమై ‘డిజిటల్ ఇండియా’ ట్వీట్ చేయడం గమనార్హం.

ఈ ప్రకారం చూస్తే.ఉమాంగ్ యాప్‌లోని మై ఆధార్ కేటగిరి కింద కొత్త సర్వీసులు యాడ్ అయ్యాయని తెలుస్తోంది.

ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చని, లేదంటే 97183-97183 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని డిజిటల్ ఇండియా పేర్కొంటోంది.

ఇప్పుడు ఏ ఏ సర్వీసులు ఉమాంగ్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయో తెలుసుకుందాం.

అందులో ఒకటి వెరిఫై ఆధార్.భారత పౌరులు ఈ ఆప్షన్ ఉపయోగించుకొని ఆధార్ స్టేటస్‌ను చాలా తేలికగా చూసుకోవచ్చు.

అలాగే ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.ఆధార్‌తో మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫై చేసుకోవచ్చు.

ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదంటే ఆధార్ నెంబర్ పొందొచ్చు.ఇకపోతే ఉమాండ్ యాప్ ద్వారా ఇంకా ఏ ఏ సర్వీసులు పొందొచ్చొ ఇపుడు కూలంకషంగా తెలుసుకుందాం.

Telugu Aadhar, Latest, Number-Latest News - Telugu

ముఖ్యంగా ఆరు రకాలైన సర్వీసులని ఇక్కడ పొందవచ్చు.ముందుగా అథంటికేషన్ హిస్టరీ తెలుసుకోవచ్చు.దానితరువాత లాక్ లేదా అన్‌లాక్ బయోమెట్రిక్స్, డౌన్‌లోడ్ ఆధార్, ఆఫ్‌లైన్ ఇకేవైసీ, జనరేట్ వర్చువల్ ఐడీ మరియు పేమెంట్ హిస్టరీని తెలుసుకోవచ్చు.ఇక ఇపుడు ఆధార్ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకుందాం.

ముందుగా ఉమాంగ్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.యాప్ లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తరువాత మై ఆధార్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి.తరువాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లింక్ చేసుకోవాలి.

ఇపుడు ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.తరువాత OTP వస్తుంది.

అది ఎంటర్ చేసిన తరువాత సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube