పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ అకౌంట్ ఉందా..?! అయితే మీకోసమే..!

గత కాలం నుండి ఇండియా లో భారతీయ పోస్టల్ సంస్థ బ్యాంకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో కూడా డబ్బులు దాచుకోవచ్చు, అలాగే ఆ దాచుకున్న డబ్బులు పై వడ్డీని కూడా పొందవచ్చు.

 Do You Have A Savings Account At The Post Office But Only For You, Postal, Savin-TeluguStop.com

అయితే అన్ని బ్యాంకులు లాగే ఈ బ్యాంకులో లాగే పోస్టల్ బ్యాంకు లో కూడా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది.ఇకపోతే తాజాగా పోస్టల్ బ్యాంక్ సంబంధించి కొన్ని కొత్త అప్ డేట్స్ ను పోస్టల్ శాఖ తెలిపింది.

తాజాగా పోస్ట్ ఆఫీస్ బ్యాంకు లో ఉన్న సేవింగ్ అకౌంట్ కు సంబంధించి లిమిట్ పెంచారు.ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ డిసెంబర్ 12వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.

తాజాగా ఇండియన్ పోస్టల్ శాఖ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది.ఆ పోస్ట్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా డిసెంబర్ 11, 2020 నుండి పోస్టల్ ఖాతాలో కచ్చితంగా మినిమం 500 రూపాయలు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరైతే మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో 500 రూపాయలు ఉంచకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు తర్వాతి కాలంలో కచ్చితంగా కట్ చేస్తారు.

వీటితోపాటు సేవింగ్ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నట్లైతే ఖచ్చితంగా అకౌంట్ క్లోజ్ అవుతుంది.

పోస్ట్ ఆఫీస్ లో కేవలం సింగిల్ అకౌంట్ మాత్రమే కాకుండా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు.ఒక వ్యక్తి కేవలం ఒక అకౌంటు మాత్రమే ఇవ్వబడుతుంది.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలో డబ్బులను ఉంచుకుంటే ఆ సొమ్ము పై 4 శాతం వడ్డీ కల్పిస్తారు.కాబట్టి ఎవరైనా సరే మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లో ఇప్పటినుంచి మినిమం 500 రూపాయలు ఉండేలా చూసుకోండి.

లేకపోతే మీ అకౌంట్ ఇబ్బందుల్లో పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube