మీ కాలి బొటనవేలు పైన వెంట్రుకలు ఉన్నాయా..? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే...  

Do You Had Hair On Our Toes -

మీ కాలి బొటన వేలును ని ఒకసారి చూసుకోండి , అక్కడ వెంట్రుకలు ఉన్నాయో లేవో జాగ్రత్తగా పరిశీలించుకోండి.ఎందుకంటే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Do You Had Hair On Our Toes

ఏంటి కాలి బొటన వెలుకి , గుండె కి సంబంధం ఎం ఉంటుంది అనుకుంటున్నారా.అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.

మన శరీరం లో వెంట్రుకలు పెరగాలంటే వాటికి తగినంత పోషకాలు అందాల్సిందేం.వెంట్రుకలు చర్మం లోపల మొదలవుతాయి , అవి రక్తం సహాయం తీసుకుంటాయి.మనం తీసుకునే ఆహారం లోని పోషకాలు రక్తం తో కలిసి వెంట్రుకల కుదుళ్లకు అందుతాయి.అక్క‌డ కొత్త క‌ణాలు నిర్మాణ‌మై వెంట్రుక‌లు ఏర్ప‌డుతాయి.

మీ కాలి బొటనవేలు పైన వెంట్రుకలు ఉన్నాయా.. అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే…-General-Telugu-Telugu Tollywood Photo Image

అలా క‌ణాలు నిర్మాణ‌మ‌య్యే కొద్దీ వెంట్రుక‌లు పెరుగుతూ పైకి వ‌స్తుంటాయి.వెంట్రుక‌ల పెరుగుద‌ల ఇలా జ‌రుగుతుంది.

గుండెకు కాలి బొటన వేలు వెంట్రుకాలకు సంబంధం ఏంటి ?

శరీరం లో ఎక్కడైనా వెంట్రుకలు మొలవాలంటే ఆ ప్రదేశానికి తగినంత రక్తం సరఫరా కావాలి .కొందరికి కాలి బొటన వేలు పైన వెంట్రుకలు బాగానే పెరుగుతాయి.మరికొందరికి అసలు పెరగవు , కారణం కాలి బొటన వేలు వరకు వారిలో రక్తం సరఫరా కావట్లేదని.అలా అంద‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే నాళాలైన ధ‌మ‌నుల్లో ఆటంకం ఏర్ప‌డ‌డ‌మే.

సాధార‌ణంగా మ‌నం తినే ఆహారం ద్వారా మ‌న శ‌రీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది.అలా ఎక్కువ మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది ధ‌మ‌నుల్లోనే.ఈ క్ర‌మంలో ధ‌మ‌నుల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వ‌ల్ల ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌రిగ్గా అవ్వ‌దు.దీంతో పోష‌కాలు కూడా స‌రిగ్గా అంద‌క వెంట్రుక‌లు పెర‌గ‌వు.

మరికొందరికి తల భాగం లో , చేతుల పైన కూడా వెంట్రుకలు ఉండవు కదా మరి వారికి గుండె జబ్బులు రావా అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి.తల భాగం , చేతులు గుండెకు దగ్గరగా ఉంటాయి దానితో ఎం సమస్య ఉండదు కానీ కాలి బొటన వేలు మాత్రం గుండెకు చాలా దూరం లో ఉంటుంది , అందుకే కాలి బొట‌న వేలిని లెక్క‌లోకి తీసుకోవాల్సి వ‌స్తుంది.

అయితే ఇక్క‌డే ఒక విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.అదేమిటంటే కాలి బొట‌న వేలిపై ఉన్న వెంట్రుక‌లు బాగా పెరిగితే అక్క‌డ ర‌క్త స‌ర‌ఫ‌రా బాగున్న‌ట్టే క‌దా.అంటే అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్న‌ట్టే లెక్క‌.అదే ఆ భాగంలో వెంట్రుక‌లు లేక‌పోతే వారికి ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని అర్థం చేసుకోవాలి.

దీంతో వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఇలాంటి వారు వెల్లుల్లి రేకుల్ని నిత్యం తింటుంటే వారిలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు