ప్రతిరోజూ ఇడ్లీ లేదా దోశ టిఫిన్ గా తింటున్నారా..? జాగ్రత్త సుమా...!

చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే లేదా పడుకునే సమయంలో టిఫిన్ గా దోశ లేదా ఇడ్లీ తీసుకునే వారు ఎందరో.ఇక ఈ రెండింటి లోకి సాంబార్, కారం పొడి వంటివి తినడం వల్ల కొన్ని అసిడిటీ బాధలు వచ్చే సూచనలు ఉన్నాయి.

 Dosa, Idli, Breakfast, Carbohydrates, Fruits-TeluguStop.com

అయితే ఇక అసలు విషయంలోకి వెళితే… బియ్యం కంటే మినప్పప్పు లోనే ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి.అంతేకాదు మనం దోశ వేసే సమయంలో అందుకు కచ్చితంగా నూనెను ఉపయోగిస్తాము.

కాబట్టి మనము దోశ ను కూడా ఆయిల్ ఫుడ్ గా పరిగణించాలి.అంతేకాదు వీటిని ఎక్కువగా తీసుకునే వారికి షుగర్ వ్యాధి తొందరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేశారు.

అలాగే చపాతీలు పరోటాలు లాంటివి తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి ఎక్కువ అవుతుందని కూడా తెలియజేస్తున్నారు.

దోశ, ఇడ్లీ లకు తయారు చేసుకోవలసిన సమయంలో వాడే మినపప్పు లో అనేక కార్బోహైడ్రేట్స్ ఉండడంవల్ల అవి కాస్త శరీరానికి ఎక్కువ పోషకాలను అందజేస్తుందని కాబట్టి వాటిని మిత ఆహారంగా తీసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇదివరకు కాలంలో మన పెద్దవారు అనేక సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండటంతో ఎక్కువ పనిని కూడా తక్కువ సమయంలో చాలా హుషారుగా చేసేవారు.నిజానికి కొన్ని పరిశోధనల్లో భాగంగా తేలిన సమాచారం మేరకు ఉదయం లేచిన తర్వాత తాజా పండ్లతో అలాగే మిత ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇక అలాగే రాత్రిపూట సమయంలో కూడా కడుపునిండా తినడం కంటే కాస్త తక్కువ ఆహారం తింటే శరీరానికి చాలా మంచిదని తెలుస్తోంది.రాత్రి సమయాలలో టిఫిన్స్ తీసుకొని జీవించేవారు కూడా వీలైతే వాటిని కొద్దిమేర వాటిని తగ్గించి వాటికి తోడుగా కాస్త పండ్లను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే పడుకునే సమయంలో పాలు లేదా మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.కాబట్టి ప్రతి రోజు దోశ, ఇడ్లీ తీసుకునేవారు వీలైనంత వరకు వాటిని కొద్దిమేర తగ్గించుకుని వాటితో పాటు పండ్లను తీసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube