జొన్న కంకి పీచుని పడేస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మా.. చాలా ఉపయోగాలు వున్నాయి!

మొక్కజొన్న పంటను భారతీయులు విరివిగా పండిస్తారు.అందుకే ఇవి ఇక్కడ చాలా చవకగా దొరుకుతాయి.

 Do You Drop Corn Silk  Oops There Are So Many Uses ,corn, Health Care, Health Ti-TeluguStop.com

ఇవి మంచి పోషకాలు ఉన్న బలమైన ఆహారం.కొందరు వీటిని కాల్చుకొని అమితంగా తింటారు.

వీటినుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లెక్స్ లాంటివి తయారు చేయడం మనకు తెలిసినదే.కొందరు బేబీ కార్న్ తో కూరలు కూడా వండుకుంటారు.

అలాగే వీటి గింజల నుండి నూనెను కూడా తీస్తారు.అయితే సాధారణంగా పచ్చిగావున్న మొక్కజొన్నను వలిచేటప్పుడు మొక్కజొన్న కంకి చివర వున్న పీచుని బయట పడేస్తారు.

అయితే వాటివలన కూడ చాలా లాభాలు ఉన్నాయి.అవి ఏంటో ఇపుడు తెలుసుకుందాం.

1.ఈ పీచు క్యాల్షియం, పొటాషియం, విటమిన్ B, C మరియు K వంటి విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.

2.ఇక ఈ పీచుతో టీ తయారు చేసుకొని తాగితే ప్లేవనాయిడ్స్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి బాగా అందుతాయి.

3.రోగనిరోధక శక్తి మెండుగా పెరుగుతుంది.అలాగే బాడీలో అవయవాలు పనితీరును మెరుగుపరుస్తుంది.

4.మొక్కజొన్నలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.యూరిన్ లో ఉండే బ్యాక్టీరియాను సమూలంగా నశింపజేస్తుంది.

5.మన శరీరంలో ఉన్న అదనపు నీరును, వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది.మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ మొక్క జొన్న పీచు సహాయపడుతుంది.

6.మొక్కజొన్న పీచు బ్లడ్ లోని కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది.అలాగే రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని త్రాగడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

7.అధిక బరువు ఉన్నవారు మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి మంచి ఫలితం దక్కుతుంది.

గమనిక: మొక్కజొన్న పీచు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి దూరని డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.

మొక్కజొన్న పీచుతో టీను ఎలా తయారు చేసుకోవాలా అనే సందేహం అవసరంలేదు.

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని కొన్ని మొక్కజొన్న పీచులను వేసి బాగా మరిగించుకోవాలి.ఆ తరువాత మరొక గిన్నెలోకి ఇలా మరిగించిన నీళ్లను వడకట్టుకోవాలి.

తరువాత ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగాలి.మొక్కజొన్న పీచుతో ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఎప్పుడైనా వీటిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొక్కజొన్నలనే కాదు పీచును కూడా వాడుకోండి.

Do you drop sorghum kanki peach Oops there are so many uses!

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube