ఆదివారాలు, పండుగ రోజుల్లో కూడా..!

కరోనా తీవ్ర మళ్లీ పెరుగుతున్న కారణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియని కూడా వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం.కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏప్రిల్ నెలలో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొనసాగించాలని ఆదేశించింది.గురువారం నుంచి మూడవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారభమైంది.45 ఏళ్లు పై బడిన అందరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 Do Vaccination On Sundays And Holidays Central Government Orders To States, Cent-TeluguStop.com

జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఫిబ్రవరిలో కరోనా కేసులు భారీగా పెరుతుతూ వచ్చాయి.బుధవారం రోజు 72 వేలకు పైగ కేసులు నమోదయ్యాయి.

పరిస్థితి మళ్లీ ఆదోళనకరంగా మారకముందే వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడ్ గా జరిపించాలని కేంద్ర నిర్ణయించింది.అందుకే ఏప్రిల్ నెలలో ఆదివారాలు పండుగ రోజుల్లో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టింది.

పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలను విధించాలని కేంద్రం చెప్పింది.కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజల్లో మళ్లీ అవగాహన చర్యలు చేపట్టాలని మాస్క్, శానిటైజర్ లాంటివి తరచు ఉపయోగించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో మాస్క్ లేని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు.కేసులు తగ్గుముఖం పట్టకపోతే రానున్న రోజుల్లో మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు ప్రవేశపెడతారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube