శివలింగానికి ఎదురుగా నంది లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం.ముఖ్యంగా మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఆ శివయ్య ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.

 Do U Know Where There Is A Temple Shivalinga Without Nandi Opposite-TeluguStop.com

శివాలయం అనగానే మనకు గర్భగుడిలో శివలింగం శివలింగానికి ఎదురుగా ఆలయంలోనే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు.శివాలయం అంటేనే ఇలాంటి అదృష్టం మన కళ్ల ముందు కదులుతోంది.

అయితే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు.మరి ఇలాంటి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

 Do U Know Where There Is A Temple Shivalinga Without Nandi Opposite-శివలింగానికి ఎదురుగా నంది లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడ మనకు రెండు ఆలయాలు దర్శనమిస్తాయి.ఒక ఆలయంలో స్వామివారి దర్శనం ఇవ్వగా మరొక ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు.ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని రాజరాజేశ్వరుడిగా, అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా భక్తులు పూజిస్తారు.అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు తన పేరు వచ్చే విధంగా ఈ ఆలయానికి ఐరావతేశ్వర స్వామిగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తోంది.

Telugu Lokeshwara Swamy Temple, Nandi, Shivalinga, Warapuram-Telugu Bhakthi

ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయం లోపలికి వెళ్లడానికి, బయట వైపు గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉంటాయి.ఈ మండపం ఒక దానిలో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు.ఈ ఆలయం ఈ విధంగా స్వామివారి విగ్రహానికి ఎదురుగా కొండా బయటవైపు నందీశ్వరుడు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.ఈ ఆలయ గోడలపై ఏక్కడ కూడా ఏ మాత్రం ఖాళీ స్థలం లేకుండా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి.

ఈ విధంగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా శివలింగం, నందీశ్వరుడు వేరు వేరుగా ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం ఈ ఆలయంలో చూడవచ్చు.

#Shivalinga #Nandi #Warapuram #LokeshwaraSwamy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI