నా వంటకు మొదట బలయ్యేది వాళ్లే.. తమన్నా షాకింగ్ కామెంట్స్?

వెండితెరపై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దక్షిణాది రాష్ట్రాలలో ఈ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.

 Do U Know How Tamanna Is Behind The Scenes  Tamanna , Tollywood,  Food,  Webseri-TeluguStop.com

ఇప్పటివరకు ఈ బ్యూటీ తెరపై ఏ విధంగా ఉంటారు? ఏంటి? అనే విషయాలు మనకు తెలుసు అదే తెరవెనుక ఎలా ఉంటుంది? ఏం ఇష్టపడతారు అనే విషయాలు చాలా మందికి తెలియవు.అయితే ఈమె తెరవెనుక ఏ విధంగా ఉంటారు అనే విషయాలు తెలుసుకోవాలంటే త్వరలోనే ప్రసారం కాబోతున్న తమన్నా కుకింగ్ షో చూడాల్సిందే.

ఇన్ని రోజులు పలు వెబ్ సిరీస్, సినిమాలలో సందడి చేసిన తమన్నా మొట్టమొదటిసారిగా బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.తెలుగులో ప్రసారం అయ్యే ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమన్నా తెలుగు భాషపై బాగా పట్టు సాధించిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా తెలుగు వంటకాలలో చేపల పులుసు హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Show, Master Show, Tamanna, Telugu, Tollywood, Tv Show-Movie

తనకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన తమన్నా ఫుడ్ చేయడం అసలు రాదనే విషయాన్ని కూడా బయటపెట్టారు.ఎప్పుడైనా అలా గరిట పట్టుకుంటానంటే అంటే తన తల్లి వద్దని వారిస్తుందని, మన వంటలపై తమ కుటుంబ సభ్యులకు అంత నమ్మకం అంటూ తనకు వంట చేయడం రాదనే విషయాన్ని తెలియజేశారు.అయితే ప్రస్తుతం తమన్నా ఒక కుకింగ్ షో కు హోస్ట్ గా వ్యవహరించడం వల్ల వంట చేయడం గురించి కొంత మేర అవగాహన ఏర్పడిందని సొంతంగా వండగలనానే నమ్మకం ఏర్పడిందని తెలిపారు.

ఇకపై ఇంట్లో కూడా వంట చేయాలనుకుంటున్నానని,నా వంటలకు మొదట బలయ్యేది నా కుటుంబ సభ్యులేనంటూ తమన్నా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube