సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా చేయాల్సిన పనులు ఇవే..!

కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి పండుగ.ఈ సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

 Sankranti Festival, Hindu Rituals, Kites, Farmers, Rangoli ,sakranthi,makararasi-TeluguStop.com

సంక్రాంతి అంటేనే కొత్త కాంతి అని అర్థం.మన జీవితంలో కష్టాలు, బాధలు తొలగిపోయి, కొత్త వెలుగులు వెలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

సూర్యుడు ధనుర్మాసం నుంచి మకరరాశిలోకి ఈరోజు ప్రవేశిస్తాడు.కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు.

సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ అని జరుపుకుంటారు.అయితే ఇంత విశిష్టత కలిగిన ఈ పండుగ రోజు కొన్ని పనులను కచ్చితంగా చేయాల్సి ఉంటుంది.

ఈ పనులను చేయడం ద్వారా అదృష్టం మన వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు.అయితే సంక్రాంతి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ రోజు ఉదయం నిద్రలేచి నీరు పారుతున్న కాలువలో స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి.వీలైతే సూర్యదేవునికి దీపాన్ని వెలిగించి పూజ చేయటం వల్ల పుణ్య ఫలం లభిస్తుంది.

అంతేకాకుండా ఈ పండుగ రోజు ఎవరైనా మనల్ని దానం అడిగితే తప్పకుండా వారికి మనకు తోచినంత దానం చేయాలి.సంక్రాంతి పండుగ రోజు ఈ విధంగా దానం చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.

Telugu Farmers, Hindu Rituals, Kites, Rangoli-Telugu Bhakthi

సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు.రైతులు పండించిన పంటలు ఇంటికి చేరడం తో రైతులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.అదేవిధంగా తమ ఇంటికి వచ్చే హరిదాసు, బసవన్నలకు ధాన్యాలను దానధర్మాలు చేయడం ద్వారా గత జన్మ దారిద్య్రాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.అందుకోసమే సంక్రాంతి పండుగ రోజు మనకు చేతనైన దానధర్మాలు చేయడం వల్ల సుఖ సంతోషాలతో గడుపుతారని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube