పొద్దునే లేవగానే టీ/కాఫీ కాచే ముందు ఈ ఒక్క పని చేస్తే, మీకు వద్దన్నా డబ్బే  

  • మనిషి జీవితంలో హ్యాపీగా సుఖ సంతోషాలతో గడపాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు లేనిదే ఒక నిమిషం గడవదు. అందువల్ల డబ్బు సంపాదించటానికి మనిషి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బుని ధర్మ,న్యాయ మార్గంలో సంపాదించటం కూడా అంతే ముఖ్యం. లేదంటే మనిషికి మనశాంతి కరువు అవుతుంది.

  • డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు. అంత కస్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి. ఆ సమస్యల బయట పడాలంటే లక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి. ప్రతి రోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజుని ప్రారంభం చేస్తారు. అయితే పాలు కాచే సమయంలో ఈ ఒక్క పని చేస్తే సంపాదించినా డబ్బు నిలుస్తుంది.


  • లక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మి దేవికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాక పాలు ఆవు నుండి రావటం వలన లక్ష్మి స్వరూపంగా భావిస్తాం.అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి. ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి. అగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలు కాయాలి. ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలి.

  • కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు. ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.