మీ రేషన్ కార్డు ఒకవేళ తొలగిస్తే ఇలా చేయండి... మళ్లీ కొత్తది వస్తుంది!

ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ప్రజలు తమకు రేషన్ రావడంలేదని, రేషన్ కార్డు ఆగిపోయిందని చెప్పడం వినే వుంటారు.అనూహ్యంగా ఇలా రేషన్ కార్డులు ఆగిపోవడం చాలామంది బాధించింది.

 Do This If Your Ration Card Gets Deleted And Get New Ration Card Details, Ration-TeluguStop.com

ఈ క్రమంలో సామన్యులకు తాజాగా ఓ తీపి కబురు చెప్పింది ప్రభుత్వం.అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకుండా వున్నా, లేదంటే వున్న కార్డు సడెన్ గా ఆగిపోయినా ఇపుడు టెన్షన్ పడకండి.

అలాంటి వారి అందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

 Do This If Your Ration Card Gets Deleted And Get New Ration Card Details, Ration-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హత కారణంగా రైస్ కార్డు కోల్పోయినవారు.నిజంగా అర్హులు అని భావిస్తే.సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మళ్లీ కొత్త కార్డు పొందే అవకాశం ఉంది.దీనికి సంబంధించి కొత్తకార్డు మంజూరుకు ఫౌర సరఫరాల శాక అవకాశం కల్పించింది.

ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో స్ల్పిట్ ఆప్షన్ తీసుకొచ్చింది.వీరితో పాటు.

ఒంటరి వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చింది.అంతే సంతానం లేకుండా ఉన్నవారు.

విడాకులు తీసుకున్న వారికి కూడా ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించింది.సచివాలయానికి వెళ్లి కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి.

లేదా.? వాలంటీర్ ను అయినా సంప్రదించాలి.

Telugu Andhra Pradesh, Ap, Latest, Cards, Sachivalayam, Suggest, Volunteers-Late

గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటి వరకు రైస్ కార్డు e-KYC ను AEPDS మొబైల్ అప్లికేషన్ లో చేసే వారు.కానీ గత కొంత కాలం గా రైస్ కార్డులు సచివాలయంలో ఆన్లైన్ అవుతున్నప్పటికి eKYC చేయు మొబైల్ అప్లికేషన్ AEPDS సరిగా పని చెయడం లేదని అంటున్నారు.దీంతో కొత్తగా GSWS డిపార్ట్మెంట్ వారు రైస్ కార్డుల eKYC కొరకు వాలంటీర్లు హౌస్ హోల్డ్ మాపింగ్ కోసం ఉపయోగిస్తున్న GSWS Volunteers (గతం లో గ్రామ వార్డు వాలంటీర్) లో కొత్తగా ఆప్షన్ ఇస్తున్నారు.మీ వాలంటీర్ ను సంప్రదించి.

ప్రోసెస్ చేసుకోవాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube