అనుకోకుండా మీ వాట్సాప్ చాట్ డిలీట్ అయితే ఇలా చేయండి. క్షణాల్లో వచ్చేస్తాయ్.. !

ప్రముఖ మేసెజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు ఎంతగానో ప్రజాదారణ లభిస్తుంది.అయితే కొన్ని సార్లు మనకు తెలిసో, తెలియకో మన వాట్సాప్ చాట్‌లను మనం కోల్పోవడం జరుగుతుంది.

 Do This If You Accidentally Delete Your Whatsapp Chat Do This Thing What's Up,-TeluguStop.com

అనుకోకుండా డిలీట్ చేయడం వల్లనో లేక మరే కారణం చేతనో మన వాట్సాప్ చాట్ డిలీట్ అయిపోతుంది.అయితే ఈ చాట్ లో కాంటాక్ట్స్, మ్యాప్స్, డాక్యుమెంట్లు లాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా ఉండవచ్చు.

ఒకవేళ పొరపాటున మీ వాట్సాప్ చాట్ డిలీట్ అయితే మళ్ళీ తిరిగి మీ చాట్ హిస్టరీ అంతా పొందే అవకాశం ఉంది.అది ఎలాగో తెలుసుకోండి.

నిజానికి వాట్సాప్ యాప్ మీ చాట్స్ తన సర్వర్లలో స్టోర్ చేసుకోదు.

మీ గూగుల్ డ్రైవ్ లేదా డివైజ్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో డేటా లో స్టోర్ అయ్యి ఉంటుంది.

అలా మీ వాట్సాప్ చాట్ హిస్టరీ బ్యాకప్ అవుతుంది.ఒకవేళ మీరు పొరపాటున చాట్ హిస్టరీ డిలీట్ చేసినా.

పోగొట్టుకున్నా, మళ్ళీ పొందవచ్చు.మొదట మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి వాట్సాప్ చాట్ హిస్టరీ బ్యాకప్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి.

బ్యాకప్ అయ్యాక మాత్రమే మీరు కొత్త డివైస్‌కు మారండి.ఇలా వినియోగదారులు డైలీ, వీక్లీ, మంత్లీ బ్యాకప్ చేసుకోవచ్చు.

Telugu Chat, Delete, Latest, Whats-Latest News - Telugu

కొత్త డివైస్ లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోవాలి.సైన్ ఇన్, వెరిఫికేషన్ అయ్యాక గూగుల్ డ్రైవ్ నుంచి చాట్ హిస్టరీ రీస్టోర్ చేయాలా అని వాట్సాప్ అడుగుతుంది.అప్పుడు రీస్టోర్ మీద క్లిక్ చేస్తే చాలు.అయితే ప్రాసెస్ పూర్తి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.పూర్తయ్యాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీ పాత చాట్లు అన్ని కనిపిస్తాయి.అలా కాకుండా ఒకవేళ మీ వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్ లో కాకుండా ఎస్‌డీ కార్డులో సేవ్ చేసుకుంటే దాన్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు మార్చుకుని ఇప్పుడు వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకుని, మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

అప్పుడు కూడా వాట్సాప్‌ను మీ చాట్ హిస్టరీ రీస్టోర్ చేయడానికి పర్మిషన్ అడిగిద్ది.అప్పుడు ఓకే చెయ్యండి చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube