పెట్రోల్‌, డీజిల్ కొనుగోళ్ల‌పై క్యాష్ బ్యాక్ కోసం ఇలా చేయండి..!

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.లీటర్ ధరే సెంచరీ దాటేయగా, అది చెల్లించలేక సామాన్య, మధ్యతరగతి వర్గాల నడ్డీ విరుగుతోంది.

 Do This For Cash Back On Petrol And Diesel Purchases ..!, Petrol, Deasel, Cash B-TeluguStop.com

గ్యాస్ ధర, నిత్యావసరాల ధరలూ పెరిగాయి.మొత్తంగా ఖర్చు తడిసి మోపెడవుతుంది.

ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ట్రాంజాక్షన్స్‌పై క్యాష్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి.బాగుంటుంది కదా.కొంతలో కొంతైనా సేఫ్‌గానే ఉంటుంది.క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది? అందుకు ఏం చేయాలంటే.

పెట్రోల్, డీజిల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సరికొత్త ఫీచర్లతో ఆవిష్కరించింది.పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌ల నుంచి రీచార్జ్ కోసం ఈ కార్డును వినియోగదారులు ఉపయోగించొచ్చు.

ఈ కార్డ్‌ను కస్టమర్స్ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, బిగ్ బజార్, ఈ-కామర్స్ పోర్టల్స్ ఇతరాల్లో యూజ్ చేయొచ్చు.ఇలా యూజ్ చేయడం ద్వారా ఇతర అనేక అనేక బహుమతులతో పాటు పలు ప్రయోజనాలను అందించనున్నారు.

Telugu Taxes, Cash, Deasel, Hpcl, Icc Bank, Pay, Petrol, Reward-Latest News - Teఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు ద్వారా హెచ్‌పీసీఎల్ రిటైల్ అవుట్‌లెట్లలో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.ఇందులో 4 శాతం క్యాష్ బ్యాక్ కాగా, 1 శాతం సర్ చార్జ్ మినహాయింపు ఉంటుంది.హెచ్‌పీసీఎల్ ‘హెచ్‌పీ పే’ తో డీజిల్, పెట్రోల్ కోనుగోలు చేస్తే, పే బ్యాక్ రివార్డ్ పాయింట్లుగా అదనపు ప్రయోజనాన్ని పొందొచ్చు.ఇకపోతే ఇంధనాల కోసం ఖర్చు చేసిన మొత్తంలో కనీసం 1.5 శాతం రివార్డ్ పాయింట్లు అందుతాయి.మొబైల్ రిచార్జెస్, పవర్ బిల్స్ పేమెంట్స్‌లోనూ 5 శాతం రివార్డ్ పాయింట్లు వస్తాయి.

స్టోర్స్ ఇతరాలు, ఈ కామర్స్ పోర్టల్స్‌లో చేసే ఖర్చులకూ పేబ్యాక్ రివార్డు పాయింట్లు అందుతాయి.ఇందులో రూ.100కు 2 పే బ్యాక్ పాయింట్లు వస్తాయి.అయితే, కార్డు తీసుకున్నపుడు జాయినింగ్ బెనిఫిట్ రెండు వేల పే బ్యాక్ పాయింట్లొస్తాయి.కార్డు‌తో ఫస్ట్ ట్రాంజాక్షన్ రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ చేస్తే హెచ్ పీ పే వాలెట్ వంద రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube