జ‌గ‌న్ స‌ర్వేల్లో మంత్రి ప‌ద‌వులు వ‌చ్చే అవ‌కాశం వారికే ఉందా..?

ఏపీలో రాజ‌కీయాలు ఎంత వేఢిగా ఉన్నా స‌రే వైసీపీలో మాత్రం ఓ అంశం ఎప్ప‌టికీ హాట్ టాపిక్‌గా ఉంటోంది.అదే మంత్రి ప‌ద‌వుల అంశం.

 Do They Have A Chance To Get Ministerial Posts In Jagan Survey, Jagan, Ycp, Jaga-TeluguStop.com

ఈ పార్టీలో మొద‌టి నుంచి ఎమ్మెల్యేలు అంతా ఈ అంశం మీద‌నే ఆశ‌లు పెట్టుకుంటున్నారు.ఇక జ‌గ‌న్ పాల‌న‌లో రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా త్వ‌ర‌లోనే మార్పు ఉంటుంద‌నే వార్త‌లు ఇప్ప‌టికే పార్టీని ఉక్కిరిబిక్క‌రి చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యేలు కూడా ఎవ‌రికి వారే అంచ‌నాలు వేసేసుకుంటున్నారు.త‌మ‌కే ప‌ద‌వులు వ‌స్తాయ‌నే ఆశ‌తో ఉంటున్నారు.

అయితే ఇందులో ఎవ‌రికి ఇవ్వాల‌నే దానిపై జ‌గ‌న్ కూడా సర్వేలు చేయించిన‌ట్టు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎవ‌రికి ఇస్తే బెట‌ర్ అనే దానిపై ఆయ‌న స‌ర్వే రిపోర్టులు తెప్పించుకున్నారంట‌.

ఇందులో ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది.ఎందుకంటే ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జనసేనాని పవన్ ను ప‌రాజ‌య పాలు చేశారు.

అందుకే ఆయ‌న్ను మ‌రింత బ‌లమైన నాయ‌కుడిగా మార్చే క్ర‌మంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ఆశ‌తో ఉన్నారు.

కాగా ఈయ‌న‌తో పాటు అన‌కాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అలాగే కరణం ధర్మశ్రీ లాంటి వారు కూడా త‌మ‌కే ప‌ద‌వి వ‌స్తుంద‌ని ధీమాగా ఉన్నారు.

Telugu Ap Policits, Golla Babu Rao, Jagan, Mlagudivada, Uma Shankar, Ycp, Ycp Ml

ఇక సీనియ‌ర్ ఎమ్మెల్యులు కూడా ఇలాగే ఆశ‌తో ఉన్నారు.వ‌రుస‌గా రెండు లేదా మూడు సార్లు గెలిచిన వారంతా ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ జాబితాలో గొల్ల బాబూరావు, ఉమా శంకర్ రేసులో ఉన్నారు.వీరితో పాటు రిజ‌ర్వేష‌న్ కోటాలో కొంద‌రు ప‌ద‌వులు ఆశిస్తున్నారు.కాగా ఇలా మంత్రి ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డుతున్న వారంద‌రిపై జ‌గ‌న్ స‌ర్వే చేయించిన‌ట్టు తెలుస్తోంది.ఇందులో ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌నేది ర‌హ‌స్య‌మే అయినా కూడా త్వ‌ర‌లోనే అంత‌ర్గ‌తంగా వీరంద‌రితో చ‌ర్చించి మంత్రి ప‌ద‌వుల‌పై క్లారిటీ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube