మౌని అమావాస్య విశిష్టత... చేయాల్సిన పనులు..!

ఈ ఏడాది మౌని అమావాస్య 2021 ఫిబ్రవరి 11 గురువారం అర్ధరాత్రి రోజున ప్రారంభమవుతుంది.11వ తేదీ ప్రారంభమైన ఈ మౌని అమావాస్య 12వ తేదీ అర్ధరాత్రి 12:35 వరకు ఉంటుంది.సాధారణంగా ప్రతి అమావాస్యకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తారు.అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజు ఉదయమే నీటి కాలువలు వద్ద తలస్నానాలు ఆచరించి ఆ గంగాదేవికి పూజ చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భావిస్తారు.

 Things To Be Done On Mouni Amavasya, Amavasya, Pooja, Uniqueness, Magha New Moon-TeluguStop.com

ఈ మౌని అమావాస్య నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున మాఘస్నానాలు కూడా నిర్వహిస్తుంటారు.

తెల్లవారుజామున స్నానం పూర్తి అయ్యాక దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని పిలుస్తారు.ఈ మాఘ అమావాస్య రోజున రిషి జన్మించాడనీ చాలామంది విశ్వసిస్తారు.

ఈ విధంగా ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూజలను నిర్వహించి అమావాస్య రోజు మౌన వ్రతం పాటిస్తారు.ఈ మౌని అమావాస్య రోజు మౌన వ్రతం చేయటం వల్ల సత్యయుగంలో వేలాది సంవత్సరాల పాటు కాటిన్యం చేసిన ధర్మం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Telugu Amavasya, Magha Moon, Pooja, Rishi, Temple, Thursday, Uniqueness, Vishnnu

ఇకపోతే ఈ మౌని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలతో వారి ఇష్టదైవానికి పూజలు చేసుకొని, వారి స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేయాలి.ముఖ్యంగా నువ్వులు, నల్ల బట్టలు, నూనె వంటి వస్తువులను దానం చేయటం వల్ల శుభం జరుగుతుంది.అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే కొన్ని ప్రాంతాల వారు ఈ మాఘమాసం నెల మొత్తం వేకువజామునే చన్నీటితో స్నానం చేసి దేవాలయాలలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube