ఉద్యోగుల మీద వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌నిచేస్తాయా..?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య అగాధం విపరీతంగా పెరిగిపోయింది.ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో సుముఖంగా లేని ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

 Do The Comments Made By The Ycp Government On The Employees Work  , Ycp, Jagan ,-TeluguStop.com

ఎలాగైనా సరే సమ్మె చేసి ప్రభుత్వానికి తమ విలువేంటో చాటి చెప్పాలని చూస్తున్నారు.కానీ ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల మీద నిందలు వేస్తోంది.

వారంతా లంచగొండులని చెబుతోంది.ఈ ప్రచారం చూసిన ఉద్యోగులు తమలో తామే కుమిలిపోతున్నారు.

ఎలాగైనా సరే ప్రభుత్వానికి తమ అవసరం ఏంటో తెలియజెప్పాలని చూస్తున్నారు.కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వాటికి ప్రభుత్వం ఎంత మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామనుకుని ప్రభుత్వ ఉద్యోగులే బదనాం అయ్యారని అంతా అనుకుంటున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.

ఏపీలో ఉద్యోగులు తమకు పీఆర్సీలు కావాలని చాలా రోజులుగా ధర్నాలు చేశారు.ఎట్టకేలకు ధర్నాలు చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది.

దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.కానీ ఆ తర్వాత రెండు రోజులకు ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానాలతో తమ జీతాలు పెరగక పోగా.ప్రస్తుతం ఉన్న వాటి కంటే కూడా తగ్గుతున్నాయని రోడ్డెక్కారు.

ప్రభుత్వం పీఆర్సీల మీద జారీ చేసిన జీవోలను వెనక్కు తీసుకోవాలని ధర్నా చేస్తున్నారు.లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వేసిన ప్లాన్ అందరినీ ఆలోచింప జేసేలా ఉంది.ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర లంచగొండులని, అసలు ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు పనులు చేయరనే ప్రచారాన్ని మొదలుపెట్టింది.

ఈ ప్రచారం జనాల వద్దకు చేరేలా ప్రణాళికలు రచించారు.తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగులను ఇలా వేధించడం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.

తాము ప్రభుత్వం కోసం ఎంతో చేశామని ఉద్యోగులు కూడా వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube