పాములు పగ పడతాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం.. అమెరికా వెళ్లినా అతడిని వదలని పాము

మనుషుల మాదిరిగానే జంతువులకు ఫీలింగ్స్‌ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.జంతువులకు కోపం రావడం, తమను హింసించే వారిపై ఎదురు తిరగడం చేస్తూ ఉంటాయి.

 Do Snakes Really Take Revenge-TeluguStop.com

మన చుట్టు ఉండే కుక్క, పిల్లి, ఆవు, ఎద్దు ఇలా కొన్ని జంతువులను పరిశీలిస్తే అవి కొందరితో ఒక రకంగా, కొందరితో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.అంటే వాటికి ఫీలింగ్స్‌ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.

కొందరిని చూసినప్పుడు కోపం అనే ఫీలింగ్‌ కలగడం వల్ల అవి వైల్డ్‌గా ప్రవర్తిస్తూ ఉంటాయి.ఇక జంతువులు పగ పడతాయంటారు.

ఆ విషయం కూడా నిజమే అని పెద్దలు, అనుభవజ్ఞులు అంటున్నారు.

జంతువుల్లో ఎక్కువగా పాము పగ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం.పల్లెటూర్లో పుట్టి పెరిగిన వారికి పాము పగ గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది.ఇప్పుడు మనం చర్చించుకోబోతున్న విషయం కూడా అలాంటిదే.

భల్లారి సమీపంలోని ఒక గ్రామంకు చెందిన వారు చెప్పిన పాము పగ కథనం అందరికి ఆశ్చర్యంను కలిగించక మానది.ఆ ఊర్లో వారు పాములు పగ పడతాయని, పాములు ఒక వేళ పగ పడితే ఎన్ని సంవత్సరాల వరకు అయినా కూడా అవి పగతోనే రగిలి పోతాయని వారు అంటున్నారు.

ఆ ఊరిలో జరిగిన సంఘటన పాములు పగ పడతాయనేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతారు.ఆ ఊర్లో అపయ్య నాయుడు అనే రైతు ఉన్నాడు.

తనకున్న 15 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ కొడుకును ఉన్నత చదువులకు అమెరికా పంపాడు.కొడుకు చదువు పూర్తి చేసుకుని, అక్కడ ఉద్యోగం సంపాదించి బాగా సంపాదించడం మొదలు పెట్టాడు.

తండ్రికి నెల నెల డబ్బులు పంపుతూ ఉండేవాడు.కొడుకు పంపిన డబ్బులతో అప్పయ్య తన పక్కనే ఉన్న అయిదు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు.

బీడువారి ఉన్న ఆ పొలంను తన పొలంలో కుపుకునేందుకు చెట్టు పీకించి సదును చేయించాలని అపయ్య భావించాడు.కొన్న పొలంలో ఒక పుట్ట ఉంది.సదును చేసే సమయంలో ఆ పుట్టను అపయ్య తోమించాడు.పుట్ట తోముతున్న సమయంలో రెండు పాములు అందులోంచి వెళ్లాయి.పెద్ద పాము అక్కడ నుండి తప్పించుకుని పొదల్లోకి వెళ్లగా, చిన్న పామును మాత్రం అప్పయ్య చంపేశాడు.చిన్న పామును చంపేసిన విషయం పెద్ద పాము చూసిందో ఏమో కాని అతడిపై పగ పెంచుకుంది.

ఈ సంఘటన జరిగిన కొన్ని వారాలకు అపయ్య కొడుకు వద్దకు అమెరికా వెళ్లి ఆరు నెలల పాటు అక్కడే ఉన్నాడు.ఆరు నెలల తర్వాత అపయ్య తిరిగి వచ్చి, తన పొలం వద్దకు వెళ్లాడు.

ఎక్కడైతే అపయ్య పుట్టను తొవ్వించాడో అక్కడే పాము కాటుకు బలయ్యాడు.ఆ రోజు తప్పించుకున్న పాము అతడిని కాటు వేసి చంపి ఉంటుందని ఆ ఊరి ప్రజలు అంటున్నారు.

ఆరు నెలల పాటు ఆ పాము అపయ్య రాక కోసం ఎదురు చూసి వచ్చి రాగానే కాటు వేసి చంపేసిందని వారు చెబుతున్నారు.

పాములు ఎంతగా పగ పడుతాయో ఈ సంఘటన ద్వారా అక్కడి వారు వివరిస్తున్నారు.

అయితే కొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు.కాకతాళీయంగా జరిగిందే తప్ప పగపట్టి పాము చంపలేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube