కొబ్బరి పువ్వే కదా అని తేలికగా తీసుకోవద్దు.. ఇందులో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయంటే..?!

సిటీలో అయితే మనకు కొబ్బరి చెట్లు కనిపించవు కానీ పల్లెటూరిలో ఎక్కడ చుసిన ఇంటికో కొబ్బరి చెట్టు మనకు కనిపిస్తుంది.అలాగే కొంతమంది కొబ్బరి తోటలను కూడా పెంచుతూ ఉంటారు.

 Do Not Take Coconut Flower Lightly How Many Medicinal Properties Are There In It-TeluguStop.com

కొబ్బరి చెట్టు లోని ప్రతి భాగము మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొబ్బరికాయ దగ్గర నుండి కొబ్బరి ఆకు వరకు ఏది కూడా వేస్ట్ కాదు.

ఎంత టెక్నాలజీ మారినాగాని ఇప్పటికి కొబ్బరి ఈనెల చీపురునే మనం వాడుతూ ఉన్నాము.అలాగే కొబ్బరి కాయకు దేవుడిగా మధ్య విడదీయలేని సంబంధం ఉందని మన అందరికి తెలిసిన విషయమే.

దేవుడి గుడికి వెళ్లే ప్రతి భక్తుడు కూడా తప్పకుండా కొబ్బరి కాయను తన వెంట తీసుకుని వెళ్లతాడు.అయితే కొబ్బరికాయ కొట్టిన తరువాత కొబ్బరికాయలో పువ్వు రావడం మీరు ఎప్పుడన్నా చూసారా.

అలా పువ్వు వస్తే మంచి జరుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.కొందరైతే ఆ కొబ్బరి పువ్వును తింటారు.

మరికొందరు అయితే ఆ కొబ్బరి కాయలో వచ్చే పువ్వును తీసి పారేస్తారు.నిజానికి కొబ్బరి పువ్వులో ఉన్న ఔషధ గుణాల గురించి మీరు తెలుసుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా కొబ్బరి పువ్వును పారేయరు.

మరి కొబ్బరి పువ్వు తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.

అసలు కొబ్బరి పువ్వు ఎలా ఏర్పడుతుందో ముందుగా తెలుసుకుందాం.

కొబ్బరి కాయలోని నీళ్ళు అన్ని ఇంకిపోయి కొబ్బరి ఎప్పుడయితే బాగా ముదురుతుందో అప్పుడు కొబ్బరి కాయ లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది.అలాగే ఈ కొబ్బరి పువ్వులో చాలా పోషక విలువలు ఉన్నాయి.

కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు ఈ కొబ్బరి పువ్వులోనే ఉన్నాయంటే నమ్మండి.అలాగే ఈ కొబ్బరి పువ్వు రుచి కూడా సూపర్ గా ఉంటుంది.

అలాంటి కొబ్బరి పువ్వును తినడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడంలోనూ కొబ్బరి పువ్వు చాలా సహాయపడుతుంది.

Telugu Cocanunt Flower, Benifits, Care, Tips, Latest, Proteins-Latest News - Tel

అలాగే కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బరువు ఇట్టే తగ్గుతారు.అంతేకాకుండా ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అలసట, నీరసం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.కిడ్నీ సమస్యలను నివారిస్తుంది.ఈ కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన ఇవి క్యాన్సర్ వ్యాధిని రానివ్వకుండా చేస్తాయి.అలాగే కొబ్బరి పువ్వు తినడం వలన ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.చూసారు కదా కొబ్బరి పువ్వు వలన ఎన్ని ఉపయోగాలో మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి.

కొబ్బరి పువ్వు ఎక్కడ దొరికిద్దా అని వెతులులాట మొదలుపెట్టేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube