ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడకూడదా?

దేవాలయాలలో స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఎన్నో పూజలు,యాగాలు,వేద మంత్రాల ఉచ్ఛారణతో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు.ఆ శక్తిని మనం తట్టుకోవటం చాలా కష్టం.

 Should We Not Stand Before God In The Temple ,  Temple, Superpowers, Machine Pow-TeluguStop.com

అందువల్ల ఆలయంలో దేవుని ఎదురుగా నిలబడకూడదని మన పెద్దలు నియమం పెట్టారు.మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదమంత్రాలను పఠించటం వలన గర్భగుడిలో అద్వితీయమైన శక్తి ఉంటుంది.

గర్భగుడిలో మహా శక్తులు, యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి.అలాగే మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్పుతున్నారు.

కొన్ని ఆలయాల గర్భగుడిలోకి నేరుగా సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.మనం దేవునికి ఎదురుగా నిలబడితే ఆ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్ దగ్గరకు వెళ్ళలేవు.

అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో నిలబడి నమస్కారం చేయకూడదు.పక్కన నిలబడి దేవుణ్ణి దర్శించుకొని మనస్సులోని కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి.

ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడకూడదా? - #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube