మంచంపై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి?

Do Not Keep This One Thing On Bed

చాలా మంది సంస్కృతి సంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతారు.ఈ క్రమంలోనే కొందరు వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్మి వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు.

 Do Not Keep This One Thing On Bed-TeluguStop.com

ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలను చాలా మంది ఎంతో ఖచ్చితంగా పాటిస్తారు.ఇలా వాస్తు నియమాలను పాటించే వారిలో చాలామంది మంచం పై కొన్ని విలువైన వస్తువులను ఉంచరు.

ఇలా మంచంపై కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఎంతో అశుభం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.మరి మంచం పై ఏ ఏ వస్తువులను పెట్ట కూడదు అనే విషయానికి వస్తే.

 Do Not Keep This One Thing On Bed-మంచంపై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాస్తు శాస్త్ర ప్రకారం గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు.కనుక గవ్వలు, రుద్రాక్షలు, ముత్యాలు, బంగారు, వెండి ఆభరణాలను మంచంపై పెట్టకూడదు.

అదేవిధంగా పూజకు సంబంధించిన పూజాసామాగ్రిని పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ వంటి వాటిని కూడా పెట్టకూడదు.ఈ విధమైనటువంటి వస్తువులను మంచం పై పెట్టడం వల్ల ఎంతో అశుభం అని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా బంగారు విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక మన బెడ్ రూమ్ లో బీరువా నుంచి తీసిన బంగారాన్ని మంచంపై ఉంచకూడదు.

ఇలా ఉంచడం వల్ల లేని దరిద్రం వస్తుంది.ఈ క్రమంలోనే మన ఇంటికి కొత్త బంగారాన్ని కొనుగోలు చేయకపోవడమే కాకుండా ఉన్న బంగారాన్ని కూడా ఎవరిదగ్గరైనా తాకట్టు పెట్టడం లేదా బ్యాంకులో ఉండిపోవడం జరుగుతుంది.

అందుకే బంగారాన్ని పొరపాటున కూడా మంచంపై పెట్టకూడదు.

#Gold #Silver #Vastu Tips

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube