లాక్ డౌన్ పొడిగించొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ..!

తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగింపుపై కొద్దిగంటల్లో క్లారిటీ రానుంది.సిఎం కే.

 Do Not Extend Lockdown Asaduddin Owaisi , Asaduddin Owaisi, Cabinet Meeting, Cor-TeluguStop.com

సి.ఆర్ ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ కాసేపట్లో జరుగనుంది.లాక్ డౌన్ ఎత్తివేయాలా లేదా కొనసాగించాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.అంతేకాదు కరోనా నియంత్రణ చర్యలు.వాక్సినేషన్ ప్రక్రియ.ఇంటింటి ఫీవర్ సర్వే.

బ్లాక్ ఫంగస్ రోగుల ట్రీట్మెంట్.మందులు.

పంటల సాగు గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది.కరోనా ట్రీట్ మెంట్ కోసం వైద్య, ఆరోగ్య శాఖకు అదనపు నిధులు కేటాయించే అంశంపై కూడా కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం ఉంది.

అయితే లాక్ డౌన్ కొనసాగింపుపై ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు.లాక్ డౌన్ కొనసాగించ వద్దని అన్నారు అసదుద్దీన్.

కరోనాని కట్రోల్ చేయడానికి లాక్ డౌన్ ఒక్కటి పరిష్కారం కాదని ఆయన అన్నారు.సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ విధిస్తే జన సమూహాన్ని తగ్గించవచ్చని అన్నారు.

కొవిడ్ కేసులు బాగా ఉన్నచోట మిని లాక్ డౌన్ పెట్టాలని ఆయన అన్నారు.మూడున్నర కోట్ల మంది ప్రజలు నాలుగు గంటల లాక్ డౌన్ సడలింపు టైం లో అన్ని పనులను చూసుకోలేరని అన్నారు అసదుద్దీన్.

లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గలేదని.అంతకుముందునుండే కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు.

ఓ పక్క కరోనా.పేదరికం.పోలీసుల వేధింపులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube