ఆ ఊరిలో పీరియ‌డ్స్ టైమ్‌లో ఊర్లోకి రానివ్వ‌రంట‌..!

కొన్ని, కొన్ని ఆచారాలు కట్టుబాట్లను గురించి విన్నపుడు షాక్ కు గురవడం సహాజం.నేటి టెక్నాలజీ యుగంలో కూడా ఇప్పటికీ జనాలు ఇలాంటి కట్టుబాట్లు పాటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.

 Do Not Enter The Village During Periods In That Village Of Kadapa District, Kada-TeluguStop.com

అసలు మనం ఏ యుగంలో జీవిస్తున్నాం అనే డౌటు రాక మానదు… ఎప్పుడో పాత రోజుల్లో పుట్టించిన ఆచారాలను ఇప్పటికీ పాటిస్తుండడం విడ్డూరం.

ఇక విషయంలోకి వెళ్తే.

కడప జిల్లాలో గాలివీడు మండలంలో తూంకుంట పంచాయతీ పరిధిలో ఎగువమూల పల్లె అనే కుగ్రామం ఉంది.ఇక్కడి ఆచారాల గురించి తెలిస్తే అందరూ నోరెళ్ల బెడతారు.

చూడటానికి కుగ్రామంలా ఉన్నా….ఆచారాలు మాత్రం పెదరాయుడి జమానాలో ఉన్నట్లు ఉంటాయి .ఎగువమూలపల్లెలో కేవలం 50 ఇళ్లు మాత్రమే ఉన్నాయి.ఎగువ మూల పల్లెలో నివసించే అందరూ ఏకిల నాయుళ్ల సామాజిక వర్గానికి చెందిన వారే.

ఇక్కడ పాటించే ఆచారాలను చూస్తే నవ్వు రాక మానదు.

ఈ ఊర్లోని మహిళలు ఎవరైనా పీరియడ్స్ టైంలో ఐదు రోజుల పాటు వారి సొంత ఇంట్లో కాకుండా తమ బంధువుల ఇంట్లో ఉంటారట.5 రోజుల పాటు ఊర్లో ఉండకూడదట.ఈ వింత ఆచారం గురించి విన్న వాళ్లవరైనా సరే ఆశ్చర్యపోతున్నారు.

Telugu Enter, Kadapa, Period Time, Womens-Latest News - Telugu

కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తాము ఏళ్లుగా ఇలాగే పాటిస్తున్నామని చెబుతున్నారు.మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో కఠిన చట్టాలు అమలులో ఉన్న ఈ కాలంలో ఇలాంటి కట్టుబాట్లు ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ వింత ఆచారం గురించి గ్రామస్తులను కదిలించగా.వారు దిమ్మ తిరిగి పోయే విషయాలు చెప్పారు.పూర్వపు రోజుల్లో తమ వంశానికే చెందిన స్త్రీ ఒకరు ఇలా తమకు శాపం పెట్టిందని పేర్కొన్నారు.ఒక వేళ… ఈ ఆచారాలు పాటించకపోతే…తమకు ఏదైనా కీడు జరుగుతుందేమోననే భయంతో పాటిస్తున్నట్లు వాపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube