ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుపై( Chandrababu Arrest ) హైదరాబాద్ వేదికగా ఆందోళన చేస్తున్న ఐటీ ఉద్యోగులను నిలువరించడాన్ని కేటీఆర్( KTR ) సమర్ధించుకున్నారు.పక్క రాష్ట్రపు సమస్యలకు హైదరాబాద్ ను వేదిక చేయడం సరికాదని మీడియా సమావేశం లో ఆయన కీలక వాఖ్యలు చేశారు .
చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రాలో అని ర్యాలీలు ధర్నాలు చేయాలనుకుంటే ఆంధ్రాలో చేయాలి కానీ తెలంగాణలో చేయడం ఏమిటంటూ? ఆయన నిలదీశారు.ఆంధ్రాప్రదేశ్ కి సంబందించిన రాజకీయ గొడవల కోసం తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ,ఆంధ్ర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేకమంది గత పది సంవత్సరాలుగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారని, అలాంటప్పుడు ఇక్కడ గొడవలు పెట్టడం సరికాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు అన్నది సున్నితమైన అంశం అని ఇలాంటి విషయంపై ఒకరు ర్యాలీలు చేస్తే అవతలి వర్గం కూడా ర్యాలీలు చేస్తామని కోరే అవకాశం ఉందని అందువల్ల ఎవరికి అనుమతి ఇవ్వడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.తనకు లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మంచి మిత్రులేనని ఆంధ్ర ప్రాంతంతో లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.ర్యాలీలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని లోకేష్( Nara Lokesh ) తన మిత్రుడితో ఫోన్ చేపించారని, ఒకరికీ అనుమతి ఇస్తే మరొకరికి ఇవ్వాల్సి వస్తుందని అనుమతి నిరాకరించినట్లుగా స్పష్టం చేసినట్టు చెప్పారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉన్నదని ఇలాంటి సున్నితమైన అంశంపై స్పందించడం సరికాదని తమ ఎమ్మెల్యేలు మంత్రులు వారి వ్యక్తిగత అభిప్రాయాలు ప్రకారం స్పందిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు హైదరాబాద్ ఐటీ కారిడార్ లో పెట్టుబడులు పెడుతున్నాయని ఇప్పుడు హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్త ఇమేజ్ ఉందని అలాంటప్పుడు ఇక్కడి శాంతిభద్రతలకువిఘాతం కలిగించే చర్యలను అనుమతించలేమంటూ ఆయన తేల్చి చెప్పేశారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటి కారిడార్ లో ఎటువంటి ఆందోళనలు అప్పటి ప్రభుత్వాలు అనుమతించలేదంటూ ఆయన గుర్తు చేశారు.