శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లు ఏ రోజున కత్తిరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా?

ప్రస్తుత కాలంలో జుట్టు కత్తిరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.జుట్టును ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించడం చేస్తున్నారు.

 Do Not Cut Hair On These Days According To Astrology-TeluguStop.com

అయితే పూర్వకాలంలో మన పెద్దలు ఈ విధంగా జుట్టును కత్తిరించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించేవారు.అదేవిధంగా పూర్వకాలంలో పెద్దలు జుట్టు కత్తిరించుకోవడానికి వారం-వర్జ్యం వంటివి చూసేవారు.

కానీ ప్రస్తుత కాలంలో ని వారు వారికి తోచినప్పుడు జుట్టును కట్ చేయడం గోర్లను కత్తిరించుకోవడం చేస్తున్నారు.అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏరోజు జుట్టు కత్తిరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

 Do Not Cut Hair On These Days According To Astrology-శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లు ఏ రోజున కత్తిరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శాస్త్రాల ప్రకారం ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలన్న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోపల మాత్రమే కత్తిరించుకోవాలి.అదే విధంగా అన్నదమ్ములు ఉన్న వారు ఒకే రోజున జుట్టు కత్తిరించుకోకూడదు.

ఈ క్రమంలోనే సోమవారం జుట్టు కత్తిరించుకోవాలనుకున్న వారికి సంపద శ్రేయస్సు పెరుగుతాయి.అయితే ఓకే కుమారుడు ఉన్నవారు లేదా సంతానం కోసం ఎదురు చూసే వారు సోమవారం జుట్టు కత్తిరించకూడదు.

ఇక మంగళవారం ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు అనే నియమం ఉంది.

బుధవారం జుట్టును కత్తిరించడం వల్ల మనకు ఐదు నెలల ఆయుష్షు పెరగడమే కాకుండా ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది.అదే విధంగా మనకు సంపద కూడా కలిసి వస్తుంది.లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలని భావించేవారు గురువారం ఎటువంటి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించుకోకూడదు.

గురువారం జుట్టు కత్తిరించడం వల్ల పిల్లలలో సమస్యలు ఏర్పడటం ధన నష్టం కలుగుతుంది.అక్కచెల్లెళ్ళు ఉన్నవారు పొరపాటున కూడా శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదు.శనివారం జుట్టు కత్తిరించుకోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక చాలా మంది జుట్టు కత్తిరించు కోవడానికి ఆదివారం ఎంతో అనువైన రోజుగా భావిస్తారు.

పొరపాటున కూడా ఆదివారం జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి అంకితం చేయబడినది కనుక ఆదివారం రోజు జుట్టు, గోళ్ళు కత్తిరించడం వల్ల ఆయుష్షు క్రమంగా తగ్గిపోతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు కత్తిరించు కోడానికి విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి వంటి తిథులు శుభప్రదమైనవిగా చెబుతున్నారు.అదేవిధంగా ఆదివారం ,శనివారం, మంగళవారాలలో జుట్టు కత్తిరించుకోకూడదు.

#Monday #Astrology #Astrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU