స్త్రీల లాగే పురుషులకి కూడా మోనోపాజ్ వస్తుందా ?

మోనోపాజ్ .తెలుగులో చెప్పాలంటే రుతువిరతి.

 Do Men Reach Menopause Like Women ?-TeluguStop.com

సాధారణ భాషలో చెప్పాలంటే పీరియడ్స్ ఆగిపోవడం.అంటే ఆండోత్సర్గం ఆగిపోవడం.

ఇంకా చెప్పాలంటే పిల్లల్ని కనే శక్తి కోల్పోవడం.మహిళలు సగటున 48-55 ఏళ్ల మధ్య ఈ స్టేజిలోకి ఎంటర్ అవుతారు.

అక్కడినుంచి శృంగార జీవితాన్ని ఆస్వాదించడమే తప్ప బిడ్డకు జన్మనిచ్చే ఆశ వదులుకోవాల్సిందే.మరి ఇలాంటి స్టేజి మగవారికి కూడా ఉంటుందా.

అంటే మగవారు కూడా మోనోపాజ్ దశకి చేరుకుంటారా ? మగవారు కూడా సంతానాన్ని కనే శక్తిని కోల్పోతారా ?

మోనోపాజ్ అనేది ప్రతి స్త్రీ తన జీవితంలో చూసే స్టేజ్.కాని పురుషులలో అలా కాదు.

పురుషులు కూడా పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోతారు.కాని ఇది కామన్ విషయం కాదు.

అందరికి జరగదు.దీన్నే టెస్టోస్టీరోన్ క్షీణత అని అంటారు.

సైన్స్ భాషలో చెప్పాలంటే “అండ్రోపాజ్”.ఇది అందరికి జరగదు.పురుషుల లైఫ్ స్టయిల్ ని బట్టే పురుషుడు ఈ స్టేజికి చేరుకోవడం, చేరుకోకపోవడం జరుగుతుంది.90 ఏళ్ల వయసు దాటినా తరువాత కూడా పిల్లలని కన్న ముసలివాళ్ళు ఉన్నారు, 50 దాటగానే చేతులు ఎత్తేసేవారు కూడా ఉన్నారు.చెప్పాంగా లైఫ్ స్టయిల్ ని బట్టి.

మామూలుగానైతే టెస్టోస్టీరోన్ క్షీణత 30 ఏళ్ళు దాటిన తరువాత మొదలవుతుంది.సిగరెట్, మద్యం అలవాటు ఎక్కువ ఉంటే అంతకంటే ముందే మొదలవుతుంది అనుకోండి.ఇక ఓ వయసుకి వచ్చాక, డయాబెటిక్ లాంటి సమస్యలు వస్తే, నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే, పెద్దస్థాయిలో శాస్త్రచికిత్సలు జరిగితే, స్థూలకాయం, మద్యం పానం, సిగరెట్ అలవాటు అప్పటికి ఉంటే, టెస్టోస్టీరోన్ పడిపోతూ ఉంటాయి.

ఇక ఈ హార్మోన్ లెవల్స్ దారుణంగా పడిపోతే, శృంగారం మీద ఆసక్తి తగ్గుతుంది, అలాగే పిల్లలని కనే సామర్థ్యం ఒక్కసారిగా పడిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube